పాటలకు ప్రాణం పోయాలన్నా... అద్భుతమైన అర్థాలను ఇచ్చే పాటలను రాయాలన్నా... పాటలలో కుటుంబ బంధాలను తెలియజేయాలి అన్నా... పాటలతోనే ప్రేక్షకులను ప్రభావితం చేయాలి అన్న అది కేవలం కళామతల్లి ముద్దుబిడ్డ అయినా సిరివెన్నెల సీతారామశాస్త్రి కే సాధ్యం అని అనడంలో అతిశయోక్తి లేదు. ఎలాంటి వల్గారిటీ లేకుండా పాటలను రాస్తూ ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. సిరివెన్నెల రాసిన పాటలు వినడానికి సంగీత ప్రేక్షకులు కూడా ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన పాటలు ఎన్నో అద్భుతమైన అర్థాన్ని ఇచ్చేలా ఉంటాయి. లోతుగా సిరివెన్నెల రాసిన  పాట లోని అర్థాలను అర్థం చేసుకుంటే జీవిత సత్యాలు బోధపడతాయి అని  పలువురు ప్రముఖులు కూడా చెబుతూ ఉంటారు. 

 

 అయితే సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పాటలను రచించి తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించారు. అయితే చాలామంది సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటలు వినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఎందుకంటే సిరివెన్నెల రాసిన ప్రతి పాటలో ఓ అద్భుతమైన అర్థం భావం వచ్చే విధంగా ఉంటాయి. ప్రతీ పాట ఒక ఆణిముత్యం లాంటిదే... ప్రతి పాటలోని ప్రతి లైవ్ ఒక అద్భుతమైన అర్థాన్ని ఇచ్చేది. కేవలం డైలాగ్ ల ద్వారానే కాదు పాటల ద్వారా కూడా ప్రేక్షకులను ప్రభావితం చేసి మార్పు తీసుకురావచ్చు అని నిరూపించిన గొప్ప గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. 

 


 అయితే ముఖ్యంగా ఎంతో మంది సినీ ప్రముఖులు సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన ఆణిముత్యాల్లాంటి పాటలను వినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా సిరివెన్నెల రాసిన పాటలను ఎక్కువగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వినటానికి ఇష్టపడుతూ ఉంటారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటలు ఎంతో అద్భుతమైన అర్ధాన్ని ఇచ్చేలా ఉంటాయని అందుకే ఆయన పాటలు వినడం అంటే తనకు ఎంతో ఇష్టమని పలుమార్లు పవన్ కళ్యాణ్ కూడా చెప్పుకొచ్చారు. అందుకే ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటలు వింటూ ఉంటాను అంటూ పవన్ కళ్యాణ్ అంటుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: