సిరివెన్నెల సీతారామశాస్త్రి.. కళామతల్లి ముద్దుబిడ్డ గా... అసలు సిసలైన కళానైపుణ్యానికి నిలువెత్తు రూపంగా తెలుగు చిత్రపరిశ్రమలో దశాబ్దాల నుంచి తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ వస్తున్నారు. దశాబ్దాలు గడిచిపోతున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి అద్భుతమైన పాటలు మాత్రం రోజురోజుకు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. నాటి తరం ప్రేక్షకుల నుంచి నేటి తరం ప్రేక్షకుల వరకు సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటలకు.. మైమరిచి పోతూనే ఉన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక గొప్ప కళా తపస్వి అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే దశాబ్దాల కాలం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో పాటలు రాశారు. 

 

 సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన పాటలు ఎన్నో తెలుగు చిత్ర పరిశ్రమలో మైలు రాళ్ళుగా నిలిచిపోయాయి. ఆయన కలం నుండి జాలువారిన ప్రతి పదం ఒక అద్భుతం.. ఆయన రాసిన పాటలు మహాద్భుతం.. ప్రతి పదంలో ఒక గొప్ప అర్థం ఉంటుంది... అందుకే సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటలు ఎక్కువగా ప్రేక్షకులకు చేరువ అవుతూ ఉంటాయి. అద్భుతమైన అర్థం వచ్చేలా పాటలు రాయడంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆయనకు ఆయనే సాటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక గొప్ప గీత రచయితగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొంతమందికి మాత్రమే సాధ్యమైన ఖ్యాతిని సంపాదించుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. 

 

 అయితే ఎన్నో సినిమాల్లో వేల సంఖ్యలో పాటలు రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రికి  ఫేవరెట్ సింగర్ మాత్రం ఒక్కరే ఉన్నారు. ఆయనే భారతదేశం గర్వించదగ్గ గాయకుడైన ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడే విధానం ఆయన వాయిస్.. ఆయన మాడ్యులేషన్ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎంతగానో నచ్చుతుందట. ఇక ఆయన రాసిన పాటలను ఎస్పీ బాలు పాడారు  అంటే మరింత సంతోషం వ్యక్తం చేస్తాడట సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రికి  కేవలం ఇష్టమైన సింగర్ మాత్రమే కాదు అతి సన్నిహితంగా ఉండే సింగర్ కూడా ఆయనే. సిరివెన్నెల ఎస్పీ బాలసుబ్రమణ్యం తో అతి సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: