విధాత తలపున అంటూ తెలుగు సినిమా సాహిత్య రూపురేఖలు మార్చిన సాహితివేత్త సిరివెన్నెల సీతారామశాస్త్రి. తెలుగు సినిమా గేయ రచనకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన ఆయన ఏదైనా పాత రాశారు అంటే అది కచ్చితంగా సూపర్ హిట్ అవ్వాల్సిందే. 1984లో జనని జన్మభూమి సినిమాకు పాటలు రాసిన సీతారామ శాస్త్రి సిరివెన్నెల పాటలతో ఆయన పేరులో ఆ సినిమా టైటిల్ కూడా వచ్చి చేరేలా చేసుకున్నారు. 

 

సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి త్రివిక్రమ్ చాలా ఎమోషనల్ గ మాట్లాడిన ఒక వీడియో అప్పట్లో చాలా వైరల్ గా మారింది. కేవలం తెలుగు రచయిత కాబట్టే సీతారామశాస్త్రి గారు ఇంకా మన మధ్యలో ఉండిపోయారు. వేరే ఎక్కడైనా అయితే ఆయనకు చాలా పెద్దగా గౌరవం దక్కేదని త్రివిక్రమ్ ఆవేదనతో మాట్లాడిన విషయం తెల్సిందే. ఒక రైటర్ ఒక సాంగ్ తో ఎక్కడిదాకా వెళ్లగలడు అన్నది రుజువు చేశారు సీతారామశాస్త్రి. 

 

ఆయన కలం నుండి ఎన్నో అద్భుతమైన పాటలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రేమ గీతమైన, ప్రణయ గీతమైనా, స్ఫూర్తి గొలిపే గేయమైనా, శత్రువుని చీల్చి చెండాడే పాటైనా, ప్రజల కనువిప్పు గొలిపే పాటైనా ఇలా ఎలాంటి పాటైనా.. ఎలాంటి మాటైనా దర్శకుడు స్కెల్ ఇచ్చినా.. తాను రాసిన పాట ప్రేక్షకుల నోటా రామబాణంగా వదులుతాఋ సీతారామశాస్త్రి అందుకే తెలుగు సినీ పరిశ్రమలో పాత రచయితగా ఆయన స్థానం పదిలంగా ఉంది. ఎంతోమంది కొత్త రచయితలు వస్తున్నా సరే వాళ్లకు ఒక మెట్టు పైనే ఉండేలా సాహిత్యాన్ని అందిస్తూ ఇప్పటికి తన సత్తా చాటుతూ వస్తున్నారు సీతారామశాస్త్రి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శాస్త్రి గారికి శుభాకాంక్షలు చెబుటూ ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తుంది ఇండియాహెరాల్డ్. కామ్ టీం.               

మరింత సమాచారం తెలుసుకోండి: