తెలుగు ఇండస్ట్రీలో అష్టా చమ్మ చిత్రంతో హీరోగా పరిచయం అయిన నాని తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.  మారుతి దర్శకత్వంలో భలే భలే మగాడివోయ్ చిత్రం నాని కెరీర్ పూర్తిగా మార్చింది.  ఈ చిత్రంతో మనోడి అదృష్టం పీక్ లోకి వెళ్లింది.  ఆ తర్వాత వరుసగా ఆరు చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి.  గత ఏడాది జెర్సీ, గ్యాంగ్ లీడర్ మంచి విజయాలు అందుకున్నాయి. ప్రస్తుతం నాని, సుధీర్ బాబు మల్టీస్టారర్ చిత్రం ‘వి’ తెరకెక్కుతుంది.  లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేయలేకపోయారు.. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ కంప్లీట్ చేసి థియేటర్లో రిలీజ్ చేసేందుక సిద్దమవుతున్నారు.  తాజాగా  శ్రీకాంత్ ఓడెల అనే కొత్త కుర్రాడికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

 

గతంలో సుకుమార్ వద్ద 'రంగస్థలం' చిత్రానికి శ్రీకాంత్ దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఇటీవల కలసి శ్రీకాంత్ కథ చెప్పగా, అది నానికి బాగా నచ్చేసిందట. కథ కొత్తగా, ఎంతో ఆసక్తికరంగా ఉండడంతో, వెంటనే మరో మాట లేకుండా ఆ ప్రాజక్టుకి ఓకే చెప్పేశాడని అంటున్నారు. నాని మొదటి నుంచీ కూడా సాదాసీదా సినిమాలు చేయలేదు. తను నటించిన ఏ సినిమా చూసినా అందులో ఏదో కాస్త కొత్తదనమైనా కనపడుతుంది. అతని నటనలో కూడా సమ్ థింగ్ స్పెషల్ కనిపిస్తుంది. అందుకే కొత్త దర్శకులకు ఎక్కువగా ఛాన్సు ఇస్తుంటారు. 

 

వెరైటీ పాత్రలు, కథలతో నూతన దర్శకులు వచ్చినా, నచ్చితే కనుక వెంటనే ఓకే చెప్పేస్తాడు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ కథ కొత్తగా, ఎంతో ఆసక్తికరంగా ఉండడంతో, వెంటనే మరో మాట లేకుండా ఆ ప్రాజక్టుకి ఓకే చెప్పేశాడని అంటున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. 'టక్ జగదీశ్', 'శ్యామ్ సింగ రాయ్' చిత్రాలు సెట్స్ పై వున్నాయి. ఇవి పూర్తికాగానే శ్రీకాంత్ దర్శకత్వంలో కమిట్ అయిన చిత్రం షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: