టాలీవుడ్ లో కాస్త స్టార్ డం రాగానే చాలా మందికి వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావడం అనేది వాస్తవం. అయితే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండటం అనేది కొందరికే సాధ్యం అవుతుంది. ఎంత పెద్ద స్టార్ అయినా కొంత మంది చాలా సింపుల్ గా, ప్రశాంతంగా ఉంటారు.  ఉదాహరణకి రజినీకాంత్ ఎంత పెద్ద స్టార్ అయినా ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. తెలుగులో చిరంజీవి కూడా అంతే. యువ కథానాయకులను ప్రోత్సహిస్తూ వారి ఫంక్షన్స్ కి హాజరైయ్యి శుభాకాంక్షలు తెలుపుతారు. 

 

అయితే ఈ మధ్య కాలంలో చిరంజీవి అనేక చిత్ర  పరిశ్రమకు సబందించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అంతేకాక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటూ సహా నటుల ఏ చిన్న అకేషన్ అయినా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. చిరంజీవి కెరీర్ చూసుకుంటే ఎన్ని ఒడిదుడుకులు, ఎన్నో విజయాలు, అపజయాలు, విమర్శలు, ఎన్నో ప్రశంసలు. చిరంజీవి తన నలభై ఏళ్ళ సినీ చరిత్రలో ఎలా వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తున్నారు అనే దాని పై ఒక క్లారిటి ఇచ్చారు.

 

సినిమా ఫంక్షన్స్ లోనైనా చిరంజీవి గారిని పొగిడితే సంబరపడకుండా ఇంటికి వెళ్ళగానే నేల పై పడుకుంటానని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యులో వెల్లడించారు. ఎందుకంటే గర్వం రాకుండా ఉండటానికి చిరు ఆ విధంగా చేస్తారట. అదే విధంగా ఏ సినిమా అయినా ప్రశoసలు అందుకుంటే అది టోటల్ సినిమా కోసం పనిచేసిన వారందరి కష్టం ఫలితమే కాని నా ఒక్కడిది కాదు అని చెబుతారు. అలాగే అపజయాన్ని కూడా తీసుకుంటారు. ఏ విషయం గురించి అయినా చిరంజీవి చాలా ప్రశాంతంగా అలోచిస్తారట. ఈ కారణంగానే చిరంజీవి తన కెరీర్లో వచ్చిన విజయాలు, అపజయాలను కూడా ఒకేలా తీసుకోవడం అలవాటు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: