సినీ పరిశ్రమలో చిన్న  స్థాయి నుండి మెగా స్టార్ లా ఎదిగారు చిరంజీవి. ఆయన స్వతహాగా మృదు స్వభావి. వివాదాలకు దూరంగా ఉంటారని ఇండస్ట్రీ టాక్. ఇటు సినీ రంగం కావొచ్చు, అటు రాజకీయ రంగం కావొచ్చు వివాదాలకు దూరంగా ఉండే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయ ప్రవేశం చేసారు. అయితే అక్కడ ఎక్కువకాలం నిలదొక్కుకోలేక పోయారు. దానితో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి అభిమానులకు దగ్గరయ్యారు. 

 

నాలుగు దశాబ్దాల నుండి సినీ పరిశ్రమలో ఉన్న చిరంజీవి తను సంపాదించిన ప్రతి రూపాయి ప్రజల నుండి వచ్చిందనే సంగతి ఎన్నడు మరచిపోలేదు అనేది వాస్తవం. అందుకు ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలే నిదర్శనం. వీటిని పక్కన పెడితే చిరంజీవి చేసిన గుప్త దానాల సంగతి ఎవరికి తెలీదు. ఇండస్ట్రీలో  మిమిక్రి ఆర్టిస్ట్   హరికిషన్ కి అనారోగ్యం ఏర్పడి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేశారు. అయినా ఫలితం లేక రోజు డైయాలిసిస్ చేయించుకోవడానికి డబ్బు లేక దిక్కు తూచని స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి చిరంజీవి మానవతా దృక్పదం తో స్పందించి లక్ష రూపాయలు అందించారు. 

 

ఇంకా ఏమైనా సహాయం కావలిస్తే మొహమాట పడకుండా అడగమని లెటర్ రాసి పంపించారు. సినిమాలే కాక రాజకీయ నాయకుడిగా తూర్పు గోదావరి జిల్లాలోని సంపర అనే గ్రామం  వెనకబడి ఉండగా ఆ గ్రామాన్ని రాజ్య సభ సభ్యుడిగా సందర్శించిన చిరంజీవి అక్కడి పరిస్థితులను చూసి చలించి వెంటనే మూడు కోట్ల రూపాయలు అధికారులకు ఇచ్చి అక్కడ స్కూల్ నిర్మించమని ఆదేశించారు. అంతేకాక అప్పట్లో పేరుపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న చిరు సంపర గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నారు.  అందుకే మూడు కోట్లు దానం చేసి రాజకీయ వర్గాలను ఆశ్చర్య పరిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: