జగన్ చూపు ఇపుడు టాలీవుడ్ మీద ఉంది. ఏపీకి సినీ పరిశ్రమను తీసుకురావాలని తద్వారా సినిమా యాక్టివిటీని పెంచి ఏపీకి కొత్త ఆదాయ  మార్గాన్ని వెతకాలని జగన్ ఆలోచిస్తున్నారు. అయిదేళ్ళు సీఎం గా ఉన్నా కూడా చంద్రబాబు టాలీవుడ్ విషయంలో పెద్దగా ఆలోచన చేయలేదు. దాంతో అక్కడే సినీ పరిశ్రమ పూర్తిగా  పాతుకుపోయింది.

 

అయితే జగన్ సీఎం అయ్యాక వెంటనే టాలీవుడ్ మీదనే గురి పెట్టారు. టాలీవుడ్ ని ఇటు వైపుగా తిప్పితే ఏపీకి కొత్త కళ వస్తుందని కూడా ఆశిస్తున్నారు. అందుకే మెగాస్టార్ చిరంజీవి వంటి వారు తన ఇంటికి వస్తే ఎదురెళ్ళి ఘనస్వాగతం పలికారు. చిరంజీవి కూడా ఏపీ వైపు చూస్తున్నారు. అయితే తెలంగాణాలో సినీ  పరిశ్రమ ఉండడం, కేసీయార్ కూడా టాలీవుడ్ ఏపీకి తరలిపోకుండా ఎప్పటికపుడు సినీ పెద్దలతో చర్చలు జరపడంతో ఏపీ సర్కార్ అనుకున్నట్లుగా పరిశ్రమ ఈ వైపుగా కనీసం చూడడంలేదు.

 

ఇక లేటెస్ట్ గా జగన్ బంపర్ ఆఫర్ ఒకటి  ప్రకటించేశారు. టాలీవుడ్ తో పాటు భారతీయ సినిమాలు ఏపీలో షూటింగు జరుపుకోవాలనుకుంటే లొకేషన్స్ అన్నీ కూడా ఫ్రీగానే ఇస్తామని గొప్ప వరాన్ని ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణా సర్కార్ షూటింగులకు అనుమతి ఇవ్వలేదు, తాంతో జగన్ వ్యూహాత్మకంగా ఈ అనుమతులు ఇవ్వడమే కాదు అన్నీ ఫ్రీ అనేశారు. 

 

ఇదిపుడు టాలీవుడ్ పెద్దల్లో కొత్త ఆలోచనలు కలిగిస్తుందా అన్న చర్చ మొదలైంది. నిజానికి టాలీవుడ్ పెద్దలు జగన్ సీఎం కావడాన్ని అంతగా స్వాగతించిన సందర్భాలు లేవు జగన్ ముఖ్యమంత్రి అయి ఏడాది అవుతున్నా కూడా చిరంజీవి తప్ప ఇతర పెద్దలు ఈ వైపు తొంగి చూసిన దాఖలాలు లేవు. అక్కడ కూడా పాలిటిక్స్ నడుస్తోంది అంటున్నారు. సినీ హీరో పవన్ పార్టీ ఏపీలో జగన్ కి వ్యతిరేకంగా ఉంది.

 

మరో వైపు టీడీపీకి చెందిన సొంత సామాజికవర్గం పెద్దలు సినిమాల్లో ఎక్కువగా ఉన్నారు. వారంతా కూడా సహజంగానే దూరంగా ఉంటారని ప్రచారంలో ఉంది. మరి సినిమా అంటే బిజినెస్. దానికి రాజకీయాల్లో ముడిపెట్టాలని ఎవరూ అనుకోరు. అందువల్ల జగన్ ఇచ్చిన బంపర్ ఆఫర్ మీద చర్చించి టాలీవుడ్ పెద్దలు ఒక అడుగు ముందుకు వేస్తే ఏపీకి సినీ పరిశ్రమ తరలిరాకపోయినా కొంత వరకైనా ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. చూడాలి మరి 

 

మరింత సమాచారం తెలుసుకోండి: