కాజల్ టాలీవుడ్ లో అడుగు పెట్టి దాదాపు 15 ఏళ్ళకు పైగానే అయినా సరే ఎక్కడా కూడా ఆమె క్రేజ్ అనేది టాలీవుడ్ లో తగ్గలేదు అనే చెప్పవచ్చు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఆమె. ఏ యువ హీరోయిన్ కూడా ఈ స్థాయిలో సినిమాలు చేయడం లేదు అనేది వాస్తవం. ఆమెకు అవకాశాలు వస్తున్నాయి వాటిని ఆమె సమర్ధవంతంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ఇతర భాషల్లో కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి అని వాటిని కూడా ఆమె చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

ఆమె ఇప్పుడు తమిళంలో రెండు సినిమాలు తెలుగులో ఒక సినిమా చేస్తుంది. ఇక ఇప్పుడు ఆమె పెళ్లి గురించి కూడా టాలీవుడ్ లో అనేక చర్చలు జరుగుతున్నాయి. ఆమె మాత్రం పెళ్లి చేసుకునే ఆలోచనలో లేదు అనే చర్చలు జరుగుతున్నాయి. ఆమెకు ఇప్పుడు సినిమాల మీద ఎక్కువగా దృష్టి ఉంది అని సమాచారం. అందుకే ఇప్పుడు సినిమాలనే ఎక్కువగా ఫోకస్ చేసింది అని అంటున్నారు. ఎన్ని అవకాశాలు వచ్చినా సరే ఆమె కాదు అనడం లేదు అని తెలుస్తుంది. ప్రస్తుత౦ ఆమె చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తుంది. 

 

అయితే ఇప్పుడు కుటుంబం నుంచి ఆమెకు తీవ్రంగా ఒత్తిడి వస్తుంది అని తెలుస్తుంది. దీనితో ఆమె పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్టు సమాచారం. ఆమె తండ్రి ఊరుకోవడం లేదు అని చెల్లి పెళ్లి చేసుకుని పిల్లలను కూడా కనేసింది అని ఇంకా పెళ్లి వయసు దాటితే చేసేది ఏమీ ఉండదు అని అందుకే పెళ్లి చేసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు ఆమె మీద ఒత్తిడి తీసుకుని వస్తున్నారు అని అంటున్నారు. మరి ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది అనేది చూడాలి. త్వరలోనే దీనిపై ప్రకటన వస్తుంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: