టాలీవుడ్ లో ఇప్పుడు ఇతర భాషల హీరోయిన్ లకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. చిన్న చిన్న హీరోయిన్ లను కూడా ఇతర భాషల నుంచి తీసుకునే ప్రయత్నాలను దర్శక నిర్మాతలు చేస్తున్నారు. ఇక పెద్ద పెద్ద హీరోయిన్ లు కూడా ఇప్పుడు టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ప్రధానంగా దీపిక ప్రియాంక వంటి హీరోలు తెలుగులో సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు చిరంజీవి సినిమాలో విద్యా బాలన్ నటించే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం జరుగుతుంది. 

 

చిరంజీవి తర్వాత చేయబోయే సినిమాలో ఆమెను తీసుకునే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిజం ఎంత అనేది ఇంకా తెలియదు గాని ఆమె కు ఒక కీలక పాత్ర ఇవ్వడానికి చిత్ర యూనిట్ ఓకే చెప్పింది అని సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ లో చిరంజీవి దూకుడుగా సినిమాలు చేయడమే కాకుండా పాన్ ఇండియా సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేసారు అనేది అర్ధమవుతుంది. ఈ నేపధ్యంలోనే ఆయన పాన్ ఇండియా సినిమా కోసమే అక్కడి హీరోలను హీరోయిన్ లను తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి. 

 

ప్రస్తుతం చిరంజీవి ఆచార్య అనే సినిమా లో చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ లేదా మహేష్ బాబు ఒక కీలక పాత్రలో నటించే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. మరి ఎవరు నటిస్తారు అనేది చూడాలి. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: