మాటలతోనే కోటలు కట్టాలి. అవునుఅవి కనుక వస్తే మిగిలినవి ఎలా ఉన్నా కూడా కధ సజావుగా సాగిపోతుంది. కొంతమంది కేవలం టాలెంట్ అంటూ దానినే నమ్ముకుని ఉంటారు. దాంతో వారికి బయట ఏం జరుగుతున్నది అర్ధం కాదు. వారు కూడా అలా ఒక మూలకు విసిరేసినట్లుగా ఉండిపోతారు.

 

ఇపుడు అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి  విషయం తీసుకుంటే అదే నిజం అనిపిస్తోంది. ఆమెకు అందం ఉంది. చక్కని అభినయం ఉంది. అయినా రేసులో ఎందుకో వెనకబడిపోయింది. ఏడేళ్ళ క్రితం టాలీవుడ్ కి వచ్చినా ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టినా అనేక హిట్ సినిమాల్లో చేసినా కూడా లావణ్య సీన్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. దానికి కారణం ఆమె తన గురించి తాను చెప్పుకోకపోవడం, ఇండస్ట్రీ పోకడలు తెలిసి తగినట్లుగా తెలివిగా వ్యవహరించకపోవడం అంటున్నారు.

 

అదిపుడు లావణ్య తెలుసుకుంది అని కూడా అంటున్నారు.  అందుకే లావణ్య టాలీవుడ్లో ఓ టాప్ స్టార్ ని ఒక రేంజిలో పొగిడింది. ఆయన గురించి గొప్పగా స్టేట్మెంట్ ఇచ్చింది. ఆయన ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా లావణ్య మాటల మూటలను ముత్యాలుగా చేసి వదిలింది. ఈ దెబ్బకు లావణ్యకు మంచి చాన్సులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

 

ఇదిలా ఉండగా లావణ్యది చిన్న వయసే కానీ ఒక సీనియర్ హీరోతో మొదట్లోనే ఆమె చేయడం వల్ల కుర్ర హీరోలు ఆమెను పెట్టుకోలేదని కూడా ఈ మధ్యనే  బాధపడింది. ఇవన్నీ ఇలా ఉంటే హోంలీగా లావణ్య ఉండడం కూడా ఆమెకు మైనస్ అన్న మాట కూడా ఉంది. దాంతో చూస్తారా నా అందం డోస్ అంటూ లావణ్య ఇపుడు ఇన్స్టాగ్రాంలో తన గ్లామర్ షో చేస్తోంది.

 

వేసవి ఎండల్లో టెంపరేచర్ని బాగా పెంచేస్తోంది. ఇక ఆమెకు తెలుగులో నిఖిల్ హీరోగా నటించిన అర్జున్ సురవరం మూవీ హిట్ తో కెరీర్ ట్రాక్ లో పడింది. దాంతో దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకుంటోంది. ఈసారి ఆమె సీనియర్ల నుంచి పిలుపు వచ్చినా నో అంటోందిట మొత్తానికి అందాల రాక్షసి అన్నీ నేర్చేసింది. ఇక ఆఫర్లు రావడమే తరువాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: