పాత హీరోయిన్ లు ఇప్పుడు తెలుగులో మళ్ళీ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. నిజమా కాదా అనేది పక్కన పెడితే ఇప్పుడు తెలుగులో ఒక్క అవకాశం వచ్చినా చాలు అనుకునే విధంగా పరిస్థితి ఉంది అని చెప్పవచ్చు. నిన్న‌టి త‌రం తెలుగు ప్రేక్ష‌కుల‌తో పాటు ద‌క్షిణాది న అనేక భాష‌ల్లో ప్రేక్ష‌కుల‌ను త‌మ న‌ట‌న‌తో పాటు అంద చందాల‌తో ఓ ఊపు ఊపిన సీనియ‌ర్ న‌టీమ‌ణులు ఇప్పుడు వెండి తెర మీద ఏ చిన్న ఛాన్స్ వ‌చ్చినా న‌టించేందుకు బాగా ఉత్సాహంతో ఉన్నారు. ఈ నేపధ్యంలోనే తెలుగులో గతంలో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన కొందరు హీరోయిన్ లు అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నార‌ట‌. 

 

ఈ జాబితాలో ఇప్పుడు భూమిక ఉంది. ఈమె రెండు మూడు సినిమాల్లో ఈ మధ్య కనపడిన సంగతి తెలిసిందే. నాని ఎంసీఏ సినిమాతో పాటు బాల‌య్య రూల‌ర్ సినిమాలో కూడా ఓ ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లో ఆమె న‌టించింది. ఇక ఇప్పుడు దర్శకుడికి ఆమె ఒక ఆఫర్ ఇచ్చింది అనే ప్రచారం అయితే జరుగుతుంది. అది ఏంటీ అనేది ఒక్కసారి చూస్తే... తాను న్యూడ్ గా నటించడానికి అయినా రెడీ గా ఉన్నాను అని తనకు కథలో పాత్ర డిమాండ్ చేస్తే ఏ ఇబ్బంది లేదు అని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. 

 

ఆ ఛాన్స్ వస్తే తనకు ఏ ఇబ్బంది లేదని ఆమె చెప్పినట్టు తెలుస్తుంది. దీనికి దర్శకుడి నుంచి కూడా మంచి స్పందన వచ్చింది అంటున్నారు. అయితే మిమ్మల్ని సాంప్రదాయ హీరోయిన్ గా గుర్తించారు అని ఇప్పుడు అలాంటి పాత్రలు మంచివా ? అని అడగగా ఆమె తనకు సినిమాల్లో కొనసాగాలని ఉందని అందుకే తాను ఇప్పుడు అవకాశాల కోసం చూస్తున్నా ? అని చెప్పినట్టు సమాచారం. మరి ఆమె తాజా సినిమా అప్‌డేట్ ఏంట‌నేదానిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: