నటనలో తండ్రి మంచు మోహన్ బాబు లాగా ఒక డిఫ్రెంట్ బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు మంచు మనోజ్. ఇప్పటి వరకు తను చేసిన సినిమాలతో హిట్స్ తో పాటు ఫ్లాపులు ఉన్నాయి. అయినా ఈ మంచు కుర్రాడికి క్రేజ్ మాత్రం తగ్గలేదు. కరెంట్ తీగ, గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు లాంటి సూపర్ హిట్స్ తర్వాత ఒక పవర్ఫుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'అహం బ్రహ్మాస్మి' అనే టైటిల్ తో మనోజ్ నటిస్తున్న తాజా సినిమా తెరకెక్కుతోంది. మనోజ్ ఎంఎం ఆర్ట్స్ నిర్మాణ సంస్థను ప్రారంభించి 'అహం బ్రహ్మాస్మి'ని నిర్మిస్తున్నాడు. 

 

రీసెంట్ గా మనోజ్ ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి గట్టి షాకిచ్చాడు. ఈ ఫస్ట్ లుక్ చూస్తేనే మనోజ్ ఈ సినిమా కోసం ఎంతగా శ్రమిస్తున్నాడో అర్థమవుతుంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా కేటగిరీలో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు మనోజ్. చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనోజ్ ఈ సినిమాని నిర్మించడం అంటే పెద్ద సాహసమనే చెప్పాలి. ఈ సినిమా తో మనోజ్ భారీ హిట్ దక్కించుకోవాలని ఎంతగానో శ్రమిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ ఉండగా దాని కోసం ఏకంగా ఆరుకోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తాజా సమాచారం.

 

ప్రముఖ యాక్షన్ కొరియో గ్రాఫర్ పీటర్ హెయిన్స్ నేపథ్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించనున్నారట. ఈ సినిమాలో ఈ ఫైట్ సీక్వెన్స్ హైలైట్ గా నిలవనుందట. 8 నిమిషాల పాటు సాగే ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం యాభైరోజుల పాటు షూటింగ్ జరపనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకూ తన సినిమాల్లో కనిపించని, కొత్త మనోజ్ ని చూస్తారని ఎంతో ధీమాగా చెబుతున్నాడు. మొత్తానికి మంచు హీరో సాహసం చూస్తుంటే ఈ సారి భారీ సక్సస్ ని అందుకోబోతున్నాడని అర్థమవుతుంది. అంతేకాదు ఈ సినిమాతో మనోజ్ దమ్ము ధైర్యం ఏంటో కూడా తెలుస్తుందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: