ఆలీ సినిమా ఫంక్షన్‌ కు చీఫ్ గెస్ట్ గా కేసీఆర్.. ఏంటీ ఈ వార్త టైటిల్ చూస్తే నమ్మబుద్ది కావడం లేదు కదూ.. అసలు కేసీఆర్ కు సినిమా ఫంక్షన్లంటేనే పెద్దగా ఇంట్రస్టు ఉండదు. ఆయన సీఎంగా ఉండగా సినిమా ఫంక్షన్లకు వచ్చిన ఆనవాళ్లు పెద్దగా లేవు. మరి అలాంటిది కేసీఆర్ ఏంటి.. సినిమా ఫంక్షన్ కు గెస్ట్ గా రావడం ఏంటి.. అందులోనూ ఆలీ వంటి చిన్న స్థాయి నటుడి సినిమా ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా రావడం ఏంటి.. అనుకుంటున్నారా.. కానీ ఇది అక్షరాలా నిజం.

 

 

కాకపోతే.. ఇది జరిగింది ఇప్పుడు కాదు. కనీసం పాతికేళ్ల పైమాటే. అప్పట్లో ఆలీ మొట్టమొదటిసారి హీరోగా యమలీల సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. అప్పట్లో మాంచి హిట్ సినిమాడైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి కథను నమ్ముకుని ఆలీని హీరోగా పెట్టి సినిమా తీసి బ్రహ్మాండమైన సక్సస్ సాధించాడు. కేవలం 75 లక్షల రూపాయల ఖర్చుతో సినిమా తీసి అప్పట్లోనే 12 కోట్ల రూపాయల వరకూ కలెక్షన్లు సాధించాడు.

 

 

IHG

 

అమ్మ సెంటిమెంట్, ఆలీ కామెడీ, యముడిగా కైకాల నటన .. ఎస్వీ కృష్ణారెడ్డి మెలోడీ మ్యూజిక్.. ఇలా అన్నీ బాగా కుదిరి సినిమా బంపర్ హిట్ అయ్యింది. పల్లె పట్నం అన్న తేడా లేకుండా అన్ని చోట్లా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అప్పట్లో ఈ సినిమా సిద్దిపేట వంటి చిన్న పట్టణంలో కూడా రోజులు పూర్తి చేసుకుంది. దీంతో అక్కడ ఓ ఫంక్షన్ చేయాలని సినిమా యూనిట్ తలపెట్టింది. మరి అలాంటి ఫంక్షన్లకు అక్కడి లోకల్ నాయకులను పిలవడం ఓ సాంప్రదాయం.

 

 

అప్పట్లో కేసీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. లోకల్ సినిమా ఫంక్షన్ కాబట్టి పిలవగానే ఈ ఫంక్షన్ కు హాజరయ్యారు. అప్పటిదే ఈ ఫోటో. ఈ ఫోటో బ్యాక్ డ్రాప్‌లో యమలీల సినిమా టైటిల్ కూడా కనిపిస్తుంటుంది కాస్త జాగ్రత్తగా చూస్తే. అదీ అసలు సంగతి.

మరింత సమాచారం తెలుసుకోండి: