టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరైన హీరో నాని, ముందుగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్సకత్వంలో వచ్చిన అష్టా చమ్మా సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా రంగప్రవేశం చేయడం జరిగింది. తొలిసినిమాతోనే మంచి హిట్ కొట్టిన నాని, ఆ తరువాత నుండి ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగారు. వాస్తవానికి తోలుత అసిస్టెంట్ డైరెక్టర్ గా టాలీవుడ్ కి వచ్చిన నాని, ఆ తరువాత తన టాలెంట్ తో హీరోగా మారారు. ఇక హీరోగా మారిన తరువాత మంచి సక్సెస్ఫుల్ సినిమాల్లో నటిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నానికి, యువత తో పాటు లేడీస్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. 

 

ఇక ప్రస్తుతం మరొక నటుడు సుధీర్ బాబుతో కలిసి వి అనే సినిమాలో నటిస్తున్నారు నాని. కాగా ఆ సినిమాలో నాని నెగటివ్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ని బట్టి చూస్తే చాలావరకు మనకు అది అర్ధం అవుతుంది. కాగా ఈ సినిమాలో తన పాత్ర నచ్చడం వల్లనే నెగటివ్ రోల్ అయినప్పటికీ కూడా నాని నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. తనతో ఫస్ట్ సినిమా చేసిన దర్శకుడు ఇంద్రగంటి తో నానికి మంచి పరిచయం, అనుబంధం ఉండడం కూడా ఈ సినిమాలో నాని ఆ పాత్రలో నటించడానికి ఒక కారణం అని కూడా అంటున్నారు. అయితే ఈ సినిమా తరువాత కూడా తనకు ఏదైనా సినిమాలో మంచి క్యారెక్టర్ దక్కితే, అది నెగటివ్ ది అయినా కూడా నటించడానికి కూడా నాని సిద్ధమయినట్లు చెప్తున్నారు. 

 

ఇటీవల కొన్నాళ్లుగా తనవద్దకు వస్తున్న దర్శకులు, కథకులతో ఈ మాటని నాని చెప్పడం జరిగిందని టాలీవుడ్ వర్గాల టాక్. పూర్తి స్థాయి విలన్ గా కాకుండా ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు ఈ విధంగా నెగటివ్ ఇంపాక్ట్ ఉన్న రోల్స్ నటించడానికి సిద్ధం అయిన నాని నిజంగా గ్రేట్ అని కొందరు అంటున్నారు. కాగా ఈ విషయమై ఎక్కడా కూడా అధికారిక సమాచారం లేదని, ఇందులో వాస్తవాల కోసం మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఈ వార్తలో పూర్తి నిజానిజాల కోసం మరికొన్నాళ్లు వెయిట్ చేయకతప్పదు.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: