రామ్ పోతినేని గతేడాది వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' హిట్ తో మంచి జోష్ మీదున్నాడు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు రామ్ కెరీర్లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేసిన రామ్ పోతినేని వెంటనే క్రైమ్ థ్రిల్లర్ 'రెడ్' సినిమాను పట్టాలెక్కించాడు. కిశోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్రవంతి రవి కిషోర్ ఈ సినిమాని నిర్మించారు. అయితే ఏప్రిల్‌ లో రిలీజ్ కావలసిన ఈ చిత్రం లాక్‌ డౌన్ కారణంగా వాయిదా పడింది. వరుసగా చాక్లెట్ బాయ్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్న రామ్ ఈ రెండు సినిమాలతో అవుట్ అండ్ అవుట్ మాస్ లుక్ లో కనిపించాడు. ఇస్మార్ట్ శంకర్ తో మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన ఇస్మార్ట్ రామ్.. 'రెడ్' తో మాస్ అండ్ క్లాస్ ఆడియెన్స్ ని కూడా లైన్ లో పెట్ట‌బోతున్నాడ‌ని అర్థం అవుతోంది.

 

ఇప్పటికే 'రెడ్' టీజర్ విడుదల కాగా రామ్ బర్త్ డే సందర్భంగా లేటెస్టుగా ఈ సినిమాలో 'డించక్' మాస్ సాంగ్ టీజర్ విడుదల చేసారు. ఈ సాంగ్ టీజర్ కి యూట్యూబ్ లో విశేష ఆదరణ లభిస్తోంది. సాంగ్ విడుదల చేసిన రెండు గంటల వ్యవధిలో వన్ మిలియన్ వ్యూస్ దక్కించుకున్న ఈ సాంగ్ 5 గంటల్లో 2 మిలియన్.. 10 గంటల్లో 3 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పటికే 1.90 లక్షల లైక్స్ సాధించిన ఈ సాంగ్ 6 మిలియన్ డిజిటల్ వ్యూస్ సొంతం చేసుకుంది. మణిశర్మ మాస్ బీట్ కి రామ్ మరియు హీరోయిన్ హెబ్బా పటేల్ ఎనర్జిటిక్ స్టెప్స్ తో దుమ్ము రేపారు. ఈ సాంగ్ కి ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ కొరియోగ్రఫీ చేసాడు. కాగా 'రెడ్' మూవీ తమిళ హిట్ చిత్రం తాడం కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది. రామ్ మొదటిసారి ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. మాళవిక శర్మ, అమృత అయ్యర్ మరియు నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో ఎలాంటి ఫలితాన్ని పొందబోతుందో తెలియాలంటే రామ్ చెప్పినట్టు థియేటర్లలో రిలీజయ్యే దాకా వెయిట్ చేయాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: