చిరుతతో మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చి మగధీరతో మెస్మరైజింగ్ హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ తర్వాత చేసిన సినిమా ఆరెంజ్. బొమ్మరిల్లు సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న డైరక్టర్ భాస్కర్ డైరక్షన్ లో 2010లో వచ్చిన సినిమా ఆరెంజ్. ఈ సినిమాను మెగా బ్రదర్ నాగబాబు నిర్మించారు. రామ్ చరణ్ సరసన జెనీలియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు హ్యారిస్ జైరాజ్ మ్యూజిక్ అందించారు. రిలీజ్ ముందే సాంగ్స్ సూపర్ హిట్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డది. 

 

మగధీరతో కాలభైరవగా అద్భుతమైన పాత్రలో చూసిన రామ్ చరణ్ ను రామ్ చరణ్ ను లవర్ బోయ్ పాత్రలో చూడలేకపోయారు. అంతేకాకుండా సినిమాలో నిజమైన ప్రేమ అంటూ బొమ్మరిల్లు భాస్కర్ పెట్టిన ఓ లాజిక్ ఎవరికీ అర్ధం కాలేదు. అందుకే సినిమా చరణ్ డిజాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఆ సినిమా తర్వాత భాస్కర్ కు అవకాశాలు తగ్గాయి. ఆరెంజ్ ఓ రేంజ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యూత్ ఆడియెన్స్ కు కనెక్ట్ అవ్వలేదు. 

 

అయితే దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఒక కథ రాసుకుంటే దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి సినిమా చేశారని అందుకే సినిమా పోయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా రామ్ చరణ్ సినిమాతో హిట్ కొడితే భాస్కర్ కెరియర్ ఎలా ఉండేదో కానీ ఆ సినిమా ప్లాప్ తర్వాత మళ్ళీ 3 ఏళ్ళు కనిపించలేదు. ఆ తర్వాత రామ్ తో ఒంగోలు గిత్త సినిమా చేశాడు. ఆ సినిమా కూడా ప్లాప్ అవడంతో మళ్ళీ తెలుగులో సినిమా చేయలేదు. ప్రస్తుతం అఖిల్ హీరోగా వస్తున్నా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు భాస్కర్. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: