రాజమౌళి చాలా తెలివైనవాడు. ఫ్రాబ్లమ్ ఎదురైతే దాన్నుంచి ఎలా బయటపడాలో జక్కన్నకు  బాగా తెలుసు. రాజకీయాలు తనకు తెలియవంటాడు గానీ.. పాలిటిక్స్ లోకి వస్తే మాత్రం.. మెస్మరైజ్ చేస్తాడు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా టీజర్ తో ఊరించి చేతులెత్తేశాడు. ఆ టీజర్ గురించి మర్చిపోయేలా ఫ్యాన్స్ ను మాయ చేయడం రాజమౌళికే సాధ్యమైంది. 

 

ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా భీమ్ ఫర్ రామరాజు టీజర్ ను రిలీజ్ చేద్దామనుకుంటే కరోనా అడ్డుపడింది. టీజర్ లేని లోటు ఎలా తీరుతుంది అనుకుంటే.. చివరకు సినిమా స్టిల్ ను కూడా రిలీజ్ చేయలేమని చిత్రవర్గాలు చేతులెత్తేశాయి. దీంతో నిరాశపడ్డ తారక్ ఫ్యాన్స్ ను రాజమౌళి తెలివైన ఐడియాతో ట్రీట్ ఇచ్చాడు. కొమరం భీం కోసం తారక్ చేసిన సిక్స్ ప్యాక్ స్టిల్ ను ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ తో రిలీజ్ చేయించి టీజర్ గురించి మర్చిపోయేలా చేశాడు జక్కన్న. 

 

ఎన్టీఆర్ బర్త్ డే సోషల్ మీడియాలో ఎప్పుడూ లేనంత గ్రాండ్ గా జరిగింది. అభినందనలు.. శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తారక్ కు పుట్టిన రోజు విషెస్ తెలియజేస్తూ.. జనతాగ్యారేజ్ లోని పక్కా లోకల్ సాంగ్ కు డ్యాన్స్ వేసి తారక్ కు బహుమతిగా ఇచ్చాడు. 

 

37వ ఏట అడుగుపెట్టిన తారక్ ను సినిమా ఇండస్ట్రీ ఆశీస్సులు లభించాయి. అద్భుతమైన నటన, అభినయంతో తెలుగు ప్రేక్షక అభిమానుల్ని రెండు దశాబ్దాలుగా అలరిస్తూనే ఉన్నావని.. ఆర్ఆర్ఆర్ మూవీతో కొమురం భీమ్ గా భారతదేశం మొత్తం నీ ఖ్యాతి మారుమోగాలని రాఘవేంద్రరావు ఆశించారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రాజమౌళి డైరెక్షన్ లో తొలిచిత్రంగా స్టూడెంట్ నెం.1 రూపొందింది. 

 

సినీరంగంలో నా ప్రయాణం ప్రారంభమైన నాటి నుంచి అందులో నువ్వు భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాననీ.. నీకంటే గొప్ప భీమ్ నాకు దొరకలేదని రాజమౌళి ట్వీట్ చేశాడు. హ్యాపీ బర్త్ డే మై బ్రదర్ తారక్ అంటూ రామ్ చరణ్ విషెస్ తెలియజేస్తూ లొకేషన్ లోని స్టిల్ రిలీజ్ చేశాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే రామ్ చరణ్ ఎన్టీఆర్ టీజర్ ను రిలీజ్ చేసేవాడు. నీకు ఓ రిటర్న్ గిఫ్ట్ బాకీ ఉన్నాననీ.. అది బెస్ట్ గిఫ్ట్ అవుతుందన్నాడు రామ్ చరణ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: