టాలీవుడ్ లో భారీ అంచనాలతో వచ్చే సినిమాలు ఎక్కువగా స్టార్ హీరోలవే ఉంటాయి. అయితే వారి సినిమాలు ఫ్లాప్ అయితే మాత్రం ప్రేక్షకులు అంత త్వరగా భరించే అవకాశం అనేది చాలా వరకు ఉండదు. ఇక చిరంజీవి సినిమాలు అనగానే ప్రేక్షకులు పనులు మానుకుని కూడా చూసే విధంగా ఉంటాయి అనేది వాస్తవం. చిరంజీవి సినిమాలు అనగానే చాలా మందికి ఒక పిచ్చి అనేది అదే వచ్చేస్తు ఉంటుంది. ఇక ఆయన సినిమాలో భారీ అంచనాలతో వచ్చి ఘోరంగా  ఫ్లాప్ అయిన సినిమా జై చిరంజీవ. ఈ సినిమా ద్వారా చిరంజీవి కొత్తగా ప్రేక్షకులకు ఏదో ఇవ్వాలి అని ప్రయత్నం చేసారు గాని అది సాధ్యం కాలేదు అని అంటారు. 

 

ఈ సినిమాలో ఆయన నటన తో పాటుగా కామెడి కి కూడా మంచి మార్కులే పడినా సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు అనే చెప్పవచ్చు. ఈ సినిమాలో ప్రధానంగా సమీరా రెడ్డి మైనస్ అయ్యారని అలాగే కథ కూడా కాస్త ఓవర్ గా ఉంది అని చెప్తూ ఉంటారు. కథ కాస్త బాగున్నా సరే సినిమా మాత్రం ఒక రేంజ్ లో హిట్ అయి ఉండేది అనేది చాలా మంది అప్పట్లో అభిప్రాయ పడ్డారు కూడా. అయితే ఈ సినిమాను తీసిన విధంగా తీయలేదు అని సరిగా తీసి ఉంటే మంచి విజయం సాధించేది అని చాలా మంది అప్పుడు కామెంట్స్ చేసారు. 

 

చిరంజీవి కూడా అదే అభిప్రాయం చాలా సందర్భాల్లో ఈ సినిమా గురించి వ్యక్తం చేసారు కూడా. ఈ సినిమా మీద ఆయన అప్పట్లో చాలా ఆశలు పెట్టుకున్నారు అని కాని ఆ సినిమా ఆయనను కూడా బాగా ఇబ్బంది పెట్టింది అని అంటారు. ఈ సినిమా తో కొన్ని వివాదాలు కూడా వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: