మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు, బిజినెస్ వర్గాల్లో క్రేజ్, ట్రేడ్ లో ఆసక్తి పెరిగిపోతూంటాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన కొన్ని సినిమాలు హిట్లు అవుతాయి.. మరికొన్ని అంచనాలు అందుకోలేక ఫ్లాపులు కూడా అవుతాయి. చిరంజీవి సినిమాల్లో అంతటి అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద చతికిలపడిన సినిమాల్లో మృగరాజు ఒకటి. భారీ అంచనాల మధ్య 2001 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. దేవీ ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె.దేవీవరప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు.

IHG

 

అడవి నేపథ్యంలో నడిచే ఈ సినిమా ఆ టెంపోను క్యారీ చేయలేక పోయింది. మృగరాజు అనే టైటిల్ లో ఉన్న భారీతనం సినిమాలో లేకపోయింది. అసలు కథ పక్కకెళ్లిపోయి సెకండాఫ్ లో వచ్చే ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రేక్షకులను అసహనానికి గురి చేసింది. టాలెంటెడ్ దర్శకుడిగా అప్పటికి చిరంజీవితో ‘చూడాలని ఉంది’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు గుణశేఖర్. కానీ.. మృగరాజును హ్యాండిల్ చేయడంలో విఫలమయ్యాడు. చిరంజీవి స్క్రీన్ ప్రెసన్స్, మేకోవర్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. సినిమాలో మొదటి నలభై నిముషాలతో క్రియేట్ చేసిన టెంపో, క్యూరియాసిటీ తర్వాత నెమ్మదిస్తాయి. దీంతో సినిమా డిజాస్టర్ గా నిలిచిపోయింది.

IHG

 

కొండవీటి రాజా, ఘరానామొగుడు, అల్లుడా మజాకా.. వంటి హిట్లతో నిర్మాతకు చిరంజీవితో మంచి ట్రాక్ రికార్డును ఈ సినిమా కంటిన్యూ చేయలేక పోయింది. సినిమాపై అంచనాలు పెరగడానికి ఈ క్రేజీ కాంబినేషన్ కూడా ఓ కారణం. సంగీతం పరంగా మృగరాజు ఇప్పటికీ చార్ట్ బస్టర్ అని చెప్పాలి. మణిశర్మ అందించిన పాటలన్నీ సూపర్ హిట్టే. కానీ.. పాటల్లో చిరంజీవి స్క్రీన్ ప్రెసెన్స్, విజువలైజేషన్ ఆకట్టుకోలేకపోయాయి. హిట్లు, ఫ్లాపులు సర్వసాధారణమే అయినా చిరంజీవి కెరీర్లో భారీ ఫ్లాప్ మూవీగా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: