కమర్షియల్ డైరక్టర్ వి.వి.వినాయక్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేసిన సినిమా బద్రినాథ్. ఆల్రెడీ అల్లు అర్జున్ హీరోగా బన్నీ సినిమా తీసి హిట్ అందుకున్న వినాయక్ ఈసారి భారీ బడ్జెట్ తో బద్రినాథ్ సినిమా తెరకెక్కించారు. కృష్ణ, అదుర్స్ లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వినాయక్ చేసిన సినిమాగా ఆడియెన్స్ లో మంచి అంచనాలు ఏర్పరచిన ఈ సినిమా థియేటర్ లోకి వెళ్ళాక మాత్రం షాక్ ఇచ్చింది. అల్లు అర్జున్ కెరియర్ లో బద్రినాథ్ డిజాస్టర్ లిస్ట్ లో చేరింది. 

 

సినిమా అంచనాలు అధికంగా ఉండటం.. సినిమాకు కీరవాణి సూపర్ హిట్ సాంగ్స్ ఇవ్వడంతో అంచనాలు భారీగా పెరిగాయి. అదిగాక అల్లు అర్జున్ లుక్ కొత్తగా ఉండటంతో సినిమా ఏదో సంచలనం సృస్తిస్తుందని అనుకున్నారు. చిన్ని కృష్ణ రాసిన ఈ కథ అత్యంత దారుణంగా పోయింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఏమాత్రం రాజి పడలేదు. అయితే కంటెంట్ సరిగా లేనప్పుడు ఎంత బడ్జెట్ పెట్టినా లాభం ఏముంటుంది. అలానే బద్రినాథ్ సినిమాకు భారీతనం తెర మీద కనిపిస్తున్నా దానికి తగిన కథ, కథనాలు లేకపోవడం మైనస్ అయ్యింది. 

 

సినిమాలో అల్లు అర్జున్ సరసన తమన్నా నటించింది. సినిమాలో తమన్నా అందాలు కూడా కాపాడలేకపోయాయి. సాంగ్స్, ఫైట్స్ ఇవ్వన్నీ బాగున్నా అసలు సిసలైన అథ కథనాలు దెబ్బ వేయడంతో సినిమా బన్నీకి షాకింగ్ రిజల్ట్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. బద్రినాథ్ తర్వాత త్రివిక్రమ్ డైరక్షన్ లో జులాయి సినిమాతో హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. బద్రినాథ్ తర్వాత అలాంటి మరో భారీ ప్రయోగం చేయాలని ప్రయత్నించలేదు అల్లు అర్జున్.         

 

మరింత సమాచారం తెలుసుకోండి: