IHG
 కన్నడ స్టార్ హీరో యష్ నటించిన చిత్రం కే జి ఎఫ్. ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో బాహుబలి తరువాత అంతటి క్రేజ్ ను  సంపాదించుకుంది.   ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషలలో రిలీజ్ అయిన ఈ చిత్రం సత్తా చాటింది. ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ కెజిఎఫ్ 2 ను దర్శకుడు  ఇప్పటికే పూర్తి చేశాడు.  అన్ని
 బాగుండి ఉంటే ఈ సెప్టెంబర్ లో సినిమా రిలీజ్ అయ్యేది. ప్రస్తుత లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ప్రేక్షకులు తమ అసహనాన్ని తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా కే జి ఎఫ్2 చిత్రానికి సంబంధించిన ఫ్రీ లుక్ 1 సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోలో సంజయ్ దత్ లుక్ అభిమానులను తెగ ఆకర్షిస్తోంది.

IHG' to release in <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=OCTOBER' target='_blank' title='october-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>october</a> 2020: 5 things to know

బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ తో పాటుగా మరికొందరు టాలీవుడ్ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. అయితే అఫీషియల్ గా ఈ చిత్రం నుండి  అఫీషియల్ లుక్ రిలీజ్ చేయకముందే సంజయ్ లుక్ లీక్ కావడంతో సోషల్ మీడియాలో ఈ లుక్ తెగ వైరల్ అవుతుంది. యష్ అభినానులతో పాటు బాలీవుడ్ సినీ అభిమానులు ఈ ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది ,సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు మరియు బాలీవుడ్ నటి రవీనా టాండన్ మరో కీలక పాత్రలో నటిస్తోంది.  పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో తెలుగు నుంచి రావు రమేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కే జి ఎఫ్ 2 రాఖీ భాయ్  మరోసారి రికార్డుల మోత మోగిస్తాడేమే  వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: