కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ కనీవిని ఎరగని క్రైసిస్ ఎదుర్కుంటోంది. ఒక సూక్ష్మజీవి చేతిలో చిక్కుకొని సినీ ఇండస్ట్రీ అతలాకుతలం అయింది. సినీ చరిత్రలో ఇండస్ట్రీ ఎన్నో సంక్షోభాలను విపత్తులను ఎదుర్కొన్నప్పటికీ ఇంతటి రేంజ్ లో ఎప్పుడు నష్టం చవి చూడలేదు. రెండు నెలలుగా సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి. థియేటర్స్ మల్టిప్లెక్సెస్ మూతపడ్డాయి. దీంతో ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. సినిమా మీద ఆధారపడి బ్రతుకుతున్న కొన్ని లక్షల కుటుంబాలకు జీవనోపాధి లేక జీవనం కష్టంగా మారింది. ఇప్పటికే ఇండస్ట్రీకి కొన్ని కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇది ఇంకా ఇలానే కొనసాగితే నష్ట తీవ్రత పెరిగే అవకాశం ఉంది.  అయితే ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం ఈ మధ్య కొన్ని రంగాలకు కాస్త మినహాయింపులు ఇస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో పలు రంగాలకు అటు కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరికొన్ని రంగాలకు మినహాయింపులు ఇస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. కానీ సినిమా రంగం మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో సినిమా పరిస్థితి ఏమిటన్నది మాత్రం ఇంకా తెలియడం లేదు. 

 

సినిమా షూటింగ్ లకు అనుమతి లభిస్తుందా.. థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి.. సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయి.. ప్రభుత్వాలు సినిమా షూటింగ్స్ కి అనుమతి ఇవ్వకపోతే ఏమి చేయాలి..  ఒకవేళ ప్రభుత్వం సినిమా రంగం మీద అనుమతి ఇస్తే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అయితే సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌లు ఆగిపోవడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా కుదేలయ్యింది. లాక్‌ డౌన్ 4.0 లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్‌ లకు, సినిమా థియేటర్స్, మల్టీప్లెక్స్‌లకు మాత్రం ఇంకా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. దీంతో తమకు అనుమతులిస్తే అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ తమ కార్యక్రమాలు నిర్వహించుకుంటామని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు తాము పాటించబోతున్న విధి, విధానాలను మరియు తీసుకోబోతున్న జాగ్రత్తలకు సంబంధించిన ప్లాన్‌ ను సిద్ధం చేసి పంపించింది.

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: