లాక్ డౌన్ టైమ్ లో రిలాక్స్ అవ్వకుండా కథలు వింటూ నెక్ట్స్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు సూర్య . ఇప్పటికే రెండు సినిమాలు లైన్లో పెట్టిన సూర్య.. తన కెరీర్ హిట్స్ ఇచ్చిన మరో డైరెక్టర్ తో సినిమాకు  రెడీ అంటున్నాడు . సూర్య.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు . రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ చేస్తూ.. సర్ ప్రైజ్ చేస్తున్నాడు. సూరారై పోట్రు రిలీజ్ కు రెడీగా ఉండగానే .. మరో రెండు సినిమాలు లైన్లో పెట్టేశాడు .

 

సూర్య వరుసగా 3 సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నాడు. 39 వ సినిమాగా హరి డైరెక్షన్లో చేస్తున్నాడు సూర్య. సింగం సినిమాల డైరెక్టర్ హరి.. మరోసారి సూర్యతో ఆరువ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. హరితో 39 వ సినిమా అవ్వకముందే .. 40 వ సినిమా అనౌన్స్ చేశాడు. తన సినిమాలతో వేరియేషన్ చూపిస్తున్న సూర్య, థ్రిల్లర్స్ తో నేషనల్ అవార్డులు గెలుచుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ వెట్రిమారన్ తో సినిమా చేస్తున్నాడు .

 

ఈ సినిమాలు ఇంకా రెడీ అవ్వకముందే  అయ్యా, మాత్రన్, కాప్పన్  సినిమాలు చేసిన డైరెక్టర్ కె.వి ఆనంద్ తో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు . ఈ మూడు సినిమాలు డిఫరెంట్ డిఫరెంట్ జానర్ లో వచ్చి సూర్యని కొత్తగా చూపించినవే . అందుకే సూర్యకు సెట్ అయ్యే మరో డిఫరెంట్ స్టోరీని రెడీ చేశాడట కె.వి ఆనంద్ . ఈ కాంబినేషన్  సెట్ అయితే .. మరో ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ లో సూర్యను చూడొచ్చన్నమాట . ఇలా ఫాస్ట్ గా సినిమాలు డిసైడ్ చేస్తున్నా కూడా మంచి కంటెంట్ తో ఆడియన్స్ కి నచ్చే సినిమాలు సెలక్ట్ చేసుకుంటున్నాడు సూర్య. 

మరింత సమాచారం తెలుసుకోండి: