స్టోరీ పెద్దగా లేకపోయినా డైలాగ్స్ తో మాయ చేసి ఆడియన్స్ కి మ్యాజిక్ చూపిస్తాడు ఈ మాటల మాంత్రికుడు. రీసెంట్ గా అలవైకుంఠపురంతో అదిరిపోయే సక్సెస్ అందించిన త్రివిక్రమ్  అదే ఫ్లో లో అవకాశాల్ని కొట్టేసి 5 ఏళ్లు అస్సలు ఖాళీయే లేదంటున్నాడు. అలవైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్ ఇప్పుడు వరుస సినిమాలతో  ఫుల్ బిజీగా ఉన్నాడు.  అరవిందసమేత, అలవైకుంఠపురం బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ జోష్ లో ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు రెడీ చేసుకుంటున్నాడు  త్రివిక్రమ్.


 
ఎన్టీఆర్ తో సినిమా ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకముందే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీద కాన్సన్ ట్రేట్ చేశాడు మాటల మాంత్రికుడు . కాసేపు ఈ స్టార్ హీరోలను పక్కనపెట్టి ఎప్పటినుంచో  పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న వెంకటేష్ తో సినిమా పట్టాలెక్కించబోతున్నాడు త్రివిక్రమ్.. అంతకుముందు  వెంకటేష్ నటించిన  సూపర్ హిట్ మూవీస్ నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు అదిరిపోయే పంచ్ లతో డైలాగ్స్ రాశాడు.


 
వీళ్లందరితో  పాటు మహేష్ బాబు తో మరో  సినిమా చెయ్యడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు త్రివిక్రమ్. మహేష్ రాజమౌళితో సినిమా చేసేసరికి స్క్రిప్ట్ తో సిద్దమవబోతున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. మహేష్ తో సినిమా  తర్వాత పవర్ స్టార్ తో సినిమా కి స్క్రిప్ట్ రాస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌ కి జల్సా, అత్తారింటికి దారేది సినిమాలతో సక్సెస్ ఇచ్చినా.. మెమరబుల్ 25వ సినిమా మాత్రం డిజాస్టర్ అవ్వడంతో మళ్లీ పవన్ కు సూపర్  హిట్ ఇచ్చే  సినిమా చేస్తానని  త్రివిక్రమ్ తన క్లోజ్డ్ సర్కిల్స్ లో చెప్పాడని న్యూస్.
తమ్ముడు పవన్ తో సినిమా చేశాక అన్న మెగాస్టార్ తో సినిమా  చేస్తానంటున్నాడు త్రివిక్రమ్. పవర్ స్టార్ , మెగాస్టార్ తో సినిమాలు అయ్యిపోయాక మెగా పవర్ స్టార్ తో కూడా సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్ ఇలా వరుసగా సినిమాలతో త్రివిక్రమ్.. ఫుల్ బిజీ అవ్వబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: