టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండకు ఫ్యాన్ ఫాలోయింగ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ రౌడీ హీరో క్రేజ్ కి బాలీవుడ్ కూడా ఫిదా అయిపోతుంటే విజయ్ మాత్రం  ఆ  ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లంటే నాకు పిచ్చి అంటున్నాడు . హిట్ , ఫ్లాపులతో సంబందం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ విజయ్ దేవరకొండ సొంతం. అసలు ఈ  యంగ్ హీరో..సినిమాల్లోకి వచ్చిన దగ్గర నుంచీ సెన్సేషనే.  ట్రెండ్ ని ఫాలో అవ్వడమే కాదు.. సెట్ చేస్తున్నాడు. అంతేకాదు తను అందరి కన్నా డిఫరెంట్ అని తన ప్రతి మూవ్ లో చూపిస్తూనే ఉన్నాడు ఈ రౌడీ హీరో.

 

విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి టాలీవుడ్, బాలీవుడ్ అంతా మోతమోగిపోతోంది. విజయ్ దేవరకొండ.. తన స్వాగ్ తో స్టైల్ తో ఈ జనరేషన్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేశాడు .బాలీవుడ్ లో  ఏ తెలుగు హీరోకి ఈ మద్య కాలంలో అంత క్రేజ్ రాలేదు . అంతగా హిందీ  స్టార్లు కూడా విజయ్ తో సినిమాలు చెయ్యాలనుకుంటున్నారు. 

 

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో పాటు చాలా మంది హీరోయిన్లు విజయ్ తో సినిమా ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంటే .. ఈ రౌడీ హీరో మాత్రం  వీళ్లెవర్నీ పట్టించుకోకుండా  బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు  దీపికా , ఆలియా భట్ అంటే నాకు విపరీతమైన ఇష్టం.. నిజానికి పిచ్చి అంటున్నాడు . ఎలాంటి  ఎక్స్ ప్రెషన్ అయినా , ఎటువంటి క్యారెక్టర్ అయినా అంత ఈజీగా ఎలా క్యారీ చేస్తారని ఎప్పుడూ దీపికా, ఆలియా ని చూసి ఆశ్చర్యపోతానంటున్నాడు విజయ్ దేవరకొండ. వీలైతే తన క్రష్ అయిన ఇద్దరు హీరోయిన్లతో సినిమాలు చెయ్యాలని ఉందంటున్నాడు  విజయ్.  

మరింత సమాచారం తెలుసుకోండి: