టాలీవుడ్ లో కొన్ని సినిమాలు ఎన్నో అంచనాలతో వస్తు ఉంటాయి. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమాలు స్టార్ హీరోలతో వస్తు ఉంటాయి. ఇక మహేశ్ బాబు హీరోగా వచ్చిన కొన్ని సినిమాలు ఎన్నో అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడిన సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా అతిధి. 2007 లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆశాగా ఎదురు చూసారు కూడా. అయితే వారి అంచనాలను ఈ సినిమా తల కిందులు చేసింది అనే మాట అక్షరాలా నిజం. 

 

సినిమా మీద మహేష్ బాబు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కూడా. అయితే సినిమా మాత్రం ఘోరంగా ఫ్లాప్ అయింది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కూడా చాలా వరకు జాగ్రత్త పడాల్సిన పరిస్థితి వచ్చింది అనేది వాస్తవం. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను అప్పుడు విడుదల చేసారు. అదే సమయంలో వచ్చిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఈ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి. ఆయన ఈ సినిమా కథ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా హిట్ అయి ఉండేది అని కొందరు అప్పట్లోనే అన్నారు కూడా.

 

ఇక ఈ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాలు మహేష్ బాబు ఫాన్స్ ని బాగా ఇబ్బంది పెట్టాయి అనే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు వాటి కారణంగా పైకి చెప్పుకోలేని విధంగా ఇబ్బంది పడ్డారు అని కామెంట్స్ వచ్చాయి అప్పట్లో. మహేష్ బాబు అయితే అసలు ఆ సినిమా ఎందుకు చేసానా అని సినిమా మొత్తం చూసిన తర్వాత బాధ పడిన సందర్భాలు కూడా ఉన్నాయని టాలీవుడ్ లో అప్పుడు వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: