సూపర్ స్టార్ మహేష్ కెరియర్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న సినిమా పోకిరి. పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా తర్వాత తనకు ఒక్కడు లాంటి కమర్షియల్ హిట్ ఇచ్చిన డైరక్టర్ కదా అని గుణశేఖర్ కు ఛాన్స్ ఇచ్చాడు మహేష్. ఒక్కడు ముందు వరకు మహేష్ ఇమేజ్ వేరు ఆ సినిమా తర్వాత మహేష్ ఇమేజ్ వేరు అనేలా సినిమా రిజల్ట్ వచ్చింది. ఇక ఆ తర్వాత గుణశేఖర్ తోనే అర్జున్ సినిమా చేశాడు మహేష్. సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన ఆ సినిమా కూడా అంచనాలను అందుకోలేదు. 

 

హ్యాట్రిక్ కాంబోగా వచ్చిన సినిమా సైనికుడు. ఈ సినిమాకు హారిస్ జైరాజ్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్ హిట్ అయ్యింది. సినిమా మాత్రం దారుణంగా పోయింది. పోకిరి తరువాత వచ్చిన ఆ సినిమా అంచనాలను అందుకోలేదు సరికదా అసలు ఈ సినిమా మహేష్ ఎందుకు ఒప్పుకున్నాడు అనే డౌట్ వచ్చేలా చేసింది. క్లైమాక్స్ లో ఒక స్టూడియోలో మహేష్ చెప్పే డైలాగ్స్ తప్ప సినిమాలో ఏమి లేదు. అతడు తర్వాత మహేష్, త్రిష కలిసి నటించిన ఈ సినిమాలో వాళ్లిద్దరి మధ్య సీన్స్ కూడా పెద్దగా పండలేదు. 

 

గుణశేఖర్ సినిమా అనగానే భారీ బడ్జెట్ ఉండాల్సిందే.. ఒక్కడు కోసం చార్మినార్ సెట్, అర్జున్ కోసం మధుర మీనాక్షి టెంపుల్ సెట్ వేయించిన గుణశేఖర్ సైనికుడు కోసం ఒక కాలనీ సెట్ వేయించారు. ఈ సినిమాను అశ్వనీదత్ నిర్మించగా సినిమా భారీ లాస్ ను తెచ్చింది. మొదటి షో నుండే ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తర్వాత మహేష్ కథల విషయంలో జాగ్రత్త పడటం నేర్చుకున్నాడు. సైనికుడు తర్వాత అతిధి, ఖలేజా కూడా నిరాశపరచగా దూకుడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు మహేష్. 

మరింత సమాచారం తెలుసుకోండి: