తారక్ కెరీర్ స్టార్ట్ అయ్యి ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకున్న తర్వాత తారక్ ఎన్నో అపజయాలను ఎదుర్కొన్నాడు. మళ్ళి రాజమౌళి తో రంగంలోకి దిగి యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ ని నటింపజేసే అతని కెరీర్ గాడి లో పెట్టాడు. ఆ తర్వాత వచ్చిన కంత్రి మాటల్లో చెప్పుకోలేనంత గా పరాజయం పొందింది. 2011 వ సంవత్సరంలో ఊసరవెల్లి యావరేజ్ టాక్ ని సంపాదించగా... తదనంతరం వచ్చిన దమ్ము చిత్రం అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. బాద్షా రామయ్యా వస్తావయ్యా అంతంత మాత్రం ఆడి ఎన్టీఆర్ ను ఒక హీరో అని గుర్తించేలా చేశాయి.


ఆ క్రమంలోనే 2014వ సంవత్సరంలో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రభస సినిమా జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లోనే భారీ అట్టర్ ఫ్లాప్ సినిమాగా పేరు తెచ్చుకుంది. అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన కార్తీక్(తారక్) కి తన తల్లి (జయసుధ) ఆమె సోదరుడి కుమార్తె ఇందు(సమంత) కు ఇతన్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది కానీ ఇరువురి ఫ్యామిలీలో చిన్న తగాదా ఏర్పడడంతో దూరమవుతారు. ఫలితంగా ఎందుకీ కార్తీక తో పెళ్లి చెడిపోతుంది. అయితే తన తల్లి అనుకున్నట్టు ఇందుని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె చదువుతున్న కాలేజీలో కార్తీక్ జాయిన్ అయి ఆమెని ప్రేమలో పడేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆ క్రమంలో అతనికి భాగ్యం(ప్రణీత) పరిచయమవుతోంది. అలాగే అతడిపై మనసు పారేసుకుంటుంది. ఆమె నుండి ఎలా తప్పించుకోవాలి? పెద్దిరెడ్డి, గంగిరెడ్డి అనే ఇద్దరు కుటుంబ పెద్దలు ఎవరు వారికి ఇతనికి కనెక్షన్ ఏంటి అనే అంశాలు ఈ సినిమాలో చూపించబడతాయి. 


నిజానికి రభస కంటే ముందే ఎన్నో సినిమాలు ఇలాంటి కథతో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. మళ్లీ అదే కథతో జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులందరికీ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎమోషనల్ సన్నివేశాల్లో చూపించిన నటన ఒక్కటి తప్ప మిగతా అన్ని విషయాలు చాలా బోరింగ్ గా రొటీన్ గా ఉన్నాయి. ప్రణీత కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకుంది కానీ సమంత మాత్రం వేడుకలను అంతగా అలరించలేకపోయింది. బ్రహ్మానందం పండించిన కామెడీ కూడా ప్రేక్షకులను బాగానే అలరించింది కానీ అది కూడా అన్ని సినిమాల్లో లాగా రూపొందించడం వలన కొత్తగా ఏమి ప్రేక్షకులకు అందించలేదని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: