పవన్ కళ్యాణ్ హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఏ స్థాయిలో ఎదురు చూసారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని సినిమా మాత్రం ఘోరంగా ఫ్లాప్ అయింది అనేది వాస్తవం. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసే విధంగా ఈ సినిమా ఉంది అనేది వాస్తవం.

 

పవన్ కళ్యాణ్సినిమా కోసం చాలా కష్టపడి చేసారు. అయితే కథ సరిగా లేకపోవడం తో పాటుగా ప్రేక్షకులకు ఇవ్వాల్సినకొన్ని కొన్ని వినోదాలను ఈ సినిమా ఇవ్వలేదు అనేది చాలా మంది చెప్పే మాట కూడా. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడ్డారు త్రివిక్రమ్ పడిన కష్టం ఎంత అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు చుక్కలు చూపించాయి అని చెప్తూ ఉంటారు. ఆ సినిమా లో ఉన్న కొన్ని సన్నివేశాలు అయితే వాటిని చూసి తర్వాత తర్వాత పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కూడా బాధ పడ్డారు అంటూ కొందరు కామెంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అనే విధంగా ఉన్నాయి. 

 

పవన్ కళ్యాణ్ ఇక అక్కడ నుంచి సినిమాలు అనగానే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది అని కొందరు కామెంట్స్ చేసారు కూడా. ఇక అది అలా ఉంటే ఆయన ఇప్పుడు వకీల్ సాబ్ అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత ఆయన చేసే మొదటి సినిమా ఇదే కావడం తో ఈ సినిమా ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: