కాటమరాయుడు... పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఒక సంచలన౦ అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ పడిన కష్టం ఎదురు చూసిన సమయం గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కూడా. అయితే ఈ సినిమా మాత్రం ఆ అంచనాలను ఏ విధంగా చూసినా సరే అందుకోలేదు అని అంటూ ఉంటారు టాలీవుడ్ ప్రేక్షకులు. ఈ సినిమా విషయం లో పవన్ కళ్యాణ్ అనవసరంగా తొందర పడ్డారు అని కూడా చాలా మంది అప్పట్లో కామెంట్స్ కూడా చేస్తూ వచ్చారు. 

 

సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ నుంచి ఏదో ఆశించారు ఆయన అభిమానులు. కాని వారికి ఏ ఒక్కటి కూడా ఈ సినిమా నుంచి దొరకలేదు. సినిమా మొదట్లో మంచి మంచి సన్నివేశాలను ఉంచారు దర్శకుడు. కాని ఆ తర్వాత తర్వాత సినిమా చాలా దారుణంగా ఉంది అనే కామెంట్స్ వచ్చాయి. సినిమాకు ఎందుకు వెళ్ళామా అనే విధంగా ఈ సినిమా ఉందని అనవసరంగా ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి తప్పు చేసారని చాలా మంది అప్పట్లో అనేసారు. అయితే ఆ సినిమాలో పవన్ తప్పు లేదని కథ తప్పు అని అన్నారు కూడా. 

 

ఇక ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు అని ప్రేక్షకులు స్వయంగా కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఆనవసరంగా ఆ సినిమాను ఓకే చేసారని ఆ సినిమా కాకుండా ఆయన మరో రీమేక్ సినిమా చేసి ఉంటే ఆయన రేంజ్ మరోలా ఉండేది అని చాలా మంది అన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన అతి పెద్ద చెత్త సినిమా అదే ఆయన కెరీర్ లో అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: