యూనివర్సల్ మీడియా బ్యానర్ కింద డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ అతి పెద్ద డిజాస్టర్ సైనికుడు తర్వాత తెలుగు వివాహం, అద్భుతమైన పెళ్లి కూతురు గురించి తెలుగు ప్రేక్షకులకు చూపించాలన్న ఉద్దేశంతో అల్లు అర్జున్ తో కలిసి వరుడు చిత్రాన్ని తెరకెక్కించాడు. అల్లు అర్జున్ రెడ్డి సినిమాలో సందీప్ అనే ఒక యువకుడి పాత్రలో నటించాడు. ఈ సందీప్ తన పెళ్లిని 5 రోజులు జరుపుకోవాలి అనుకుంటాడు. అలాగే తన పెళ్లి వేడుకలను 16 రోజుల పాటు జరుపుకోవాలనుకుంటాడు. జీలకర్ర పెట్టే సమయంలోనే పెళ్లికూతురు మొహాన్ని చూడాలనుకునే సాంప్రదాయకమైన అబ్బాయి ఈ సందీప్. తన సాంప్రదాయ పద్ధతి కి తగ్గట్టుగా దీప్తి( భానుశ్రీ మెహ్రా) తనకి తారసపడుతుంది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న సమయంలో దివాకర్ అనే ఒక వ్యక్తి పెళ్లి కూతురు ని కిడ్నాప్ చేస్తాడు. దివాకర్ ఎవరు? ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశాడు? సందీప్ దీప్తిని ఎలా కనిపెడతాడు? పెళ్లి ఎలా జరుగుతుంది? అనే అంశాలను ఈ సినిమాలో చూపించబడ్డాయి. 


అల్లు అర్జున్ నటన ఈ సినిమాలో అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. బాగా ఎనర్జిటిక్ గా ఉండే అల్లు అర్జున్ కి గుణశేఖర్ చాలా డల్ క్యారెక్టర్ ఇవ్వడం బన్నీ అభిమానులను బాగా నిరాశ పరిచింది. భాను మెహ్రా అందంగానే ఉంది కానీ ఆమె గ్లామర్ సరిగ్గా చూపించలేకపోయారు గుణశేఖర్. బ్రహ్మానందం ఈ సినిమాలో నటించాడు కానీ అతని కారెక్టర్ ఎలివేట్ చేయడంలో గుణశేఖర్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఆహుతి ప్రసాద్ ఆశిష్ విద్యార్థి సుహాసిని నరేష్ వినయ లాంటి తారాగణం ఉన్నప్పటికీ వారికి సరైన ప్రాముఖ్యత కలిగి ఉన్న క్యారెక్టర్లు ఇవ్వడంలో డైరెక్టరు ఫెయిల్ అయ్యాడు. 


ట్విన్ టవర్స్ పైన ఫైట్ సన్నివేశం... లారీ హీరో బైక్ ను ఈడ్చుకువెళ్తున్నా హీరోకి ఏమీ అవకుండా బయటపడడం... హీరో ఏకంగా సెలైన్ బాటిల్ ఎక్కించుకుంటూ హీరోయిన్ తో కలిసి యాక్షన్ సన్నివేశంలో పరిగెత్తడం లాంటివి ఈ సినిమాకి పెద్ద మైనస్ గా మారాయని చెప్పుకోవచ్చు. తెలుగు పెళ్లి గురించి వెండితెరపై చూపించాలని డైరెక్టర్ సుకుమార్ అనుకున్నది గొప్ప ఆలోచన కానీ తన ఆలోచనని వెండితెరపై సరిగ్గా చూపించలేక ఓ డిసాస్టర్ ని వరుడు సినిమా రూపంలో తన ఖాతాలో, అల్లు అర్జున్ ఖాతాలో వేశాడు డైరెక్టర్ గుణశేఖర్.

మరింత సమాచారం తెలుసుకోండి: