ఒకేసారి స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద విడుదల అవుతున్నాయి అంటే ఎంత పోటీ నెలకొంటుంది  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు స్టార్ హీరోల అభిమానులు కూడా సినిమాలు చూసేందుకు పోటాపోటీగా థియేటర్లకు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు ఎంతో అంచనాల మధ్య వచ్చే ప్రేక్షకులకు నిరాశే మిగిలిస్తే...  కొన్ని సినిమాలు మాత్రం ఎంతగానో ప్రేక్షకులకు నచ్చేస్తూ ఉంటాయి. అప్పట్లో రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మగధీర. అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా రామ్ చరణ్ ను మెగా పవర్ స్టార్ గా మార్చింది. అయితే ఈ సినిమా విడుదలైన సమయంలోనే ఎన్టీఆర్ హీరోగా నటించిన శక్తి సినిమా కూడా విడుదలైంది. 

 

 ఈ సినిమా మగధీర సినిమా కు మంచి పోటీ ఇస్తుందని... మగధీర సినిమా ని సైతం వెనక్కి నెట్టి వేస్తుంది అంటూ అప్పట్లో శక్తి సినిమా పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. కారణం ఈ సినిమాలో ఆలయ రక్షకుడిగా ఎన్టీఆర్ కొత్త లుక్... పలు యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్ లో చూపించడం. ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. దీంతో అటు మగధీర సినిమాతో పాటు శక్తి సినిమాపై కూడా భారీ అంచనాలు పెంచుకున్నారు ప్రేక్షకులు. కానీ ఎన్టీఆర్ హీరోగా నటించిన శక్తి సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక పోయింది అనే చెప్పాలి. 

 


 ఏకంగా మగధీర లాంటి సినిమాలను సైతం వెనక్కి నెట్టేసి శక్తి సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును నెలకొల్పనుంది అని ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నప్పటికీ... ఈ సినిమా ప్రేక్షకులకు నిరాశే మిగిల్చింది. ఇక ఎన్టీఆర్ కెరియర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్గా మిగిలిపోయింది శక్తి సినిమా. కనీసం యావరేజ్ టాక్  కూడా సొంతం చేసుకోలేక పోయింది. దీంతో నందమూరి అభిమానులు ఈ సినిమా కాస్త డిజాస్టర్ గా మిగిలిపోవటంతో ఎంతో నిరాశ చెందారూ  అని చెప్పాలి. ఇక శక్తి సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడం జూనియర్ ఎన్టీఆర్ లో కూడా చాలా మార్పు తీసుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: