ఇండియన్ సినిమాలో చాలా వరకు అంచనాలు ఉండే హీరోలు కొందరు ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరో రజనీ కాంత్. రజని కాంత్ సినిమాలు అనగానే ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. సినిమా హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే రజని కాంత్ సినిమాలు  అనగానే పనులు మానుకుని సినిమాకు వెళ్ళే ప్రేక్షకులు కూడా మనకు కనపడుతూ ఉంటారు. అయితే గత కొంత  కాలంగా ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేదు అనే ఆరోపణలు ఎక్కువగానే వినిపిస్తూ ఉన్నాయి. ఆయన సినిమాలు అంచనాలకు తగిన విధంగా లేవు అన్నారు. 

 

ఇక ఆయన హీరోగా వచ్చిన కబాలి సినిమా అయితే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇండియన్ సినిమాను కూడా బాగా ఇబ్బంది పెట్టింది. ఆ సినిమాను ఎన్నో అంచనాలతో తీసుకొచ్చారు ప్రేక్షకుల ముందుకి. ఇక ఆ సినిమా దర్శకుడు కూడా ప్రేక్షకులకు రజనీ లో ఉన్న ఏదో కొత్త కోణం చూపించాలి అని ప్రయత్నం చేసాడు. కాని అక్కడ అది సాధ్యం కాలేదు అనే చెప్పవచ్చు. ఆ సినిమా నుంచి ఆయన చాలా నేర్చుకున్నారు అనుకున్నారు గాని తర్వాత కూడా రజని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ఆ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాలు చూసి ప్రేక్షకులు బాధ పడిన సందర్భం కూడా ఉంది అని అంటారు. 

 

సినిమా చాలా వరకు అంచనాలతో వచ్చింది. కాని ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేదు అనేది వాస్తవం. ఇక ఆ సినిమాలో రజని కాంత్ ఓవర్ యాక్షన్ చేసారు అని కూడా అన్నారు కొందరు. ఆ సినిమా ద్వారా రజని కాంత్ కి తెలుగు మార్కెట్ బాగా పడిపోయింది. ఆ సినిమా హక్కుల ను కొన్న నిర్మాతలు కూడా చాలా బాగా నష్టపోయారు అని అంటూ ఉంటారు సినీ పరిశీలకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: