టాలీవుడ్ లో చిరంజీవి సినిమా వస్తుంది అనగానే ఒక రకమైన క్రేజ్ అనేది ఉంటుంది. ఆయన సినిమాలను చూడటానికి ప్రేక్షకులు పనులు మానుకుని కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి అనేది వాస్తవం. అయితే ఆయన సినిమాల్లో ఎన్నో అంచనాలతో వచ్చి ఘోరంగా ఫ్లాప్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి అది ఏంటీ అనేది ఒక్కసారి చూస్తే... ఆయన సినిమాలో ఘోరంగా ఫ్లాప్ అయిన సినిమా ప్రత్యేకంగా ఒకటి చెప్పుకోవచ్చు. ఆ సినిమా పేరే అంజి. ఆ సినిమా ద్వారా చిరంజీవి లో ఏదో చూద్దాం అని ఆశ పడ్డారు ఆయన అభిమానులు.

 

కాని ఆ సినిమా మాత్రం ఆయన అభిమానులను బాగా ఇబ్బంది పెట్టింది అనేది వాస్తవం. ఆ సినిమాలో ఆయన నటన చూసి బాగానే ఉంది అనుకున్నా సినిమా కథ మాత్రం ఘోరంగా ఉండటం తో చాలా మంది ప్రేక్షకులు ఆ సినిమాను చిరంజీవి ఎందుకు తీసారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ సినిమా కథ గాని ఆ సినిమాలో ఉండే సన్నివేశాలు గాని ఎక్కడ చూసినా సరే ఏ విధంగా చూసినా సరే ప్రేక్షకులకు మాత్రం ఎన్ని విధాలుగా కూడా నచ్చలేదు అనేది వాస్తవం. ఆ సినిమా తర్వాత చిరంజీవి మళ్ళీ కెరీర్ లో బాగా ఇబ్బంది పడ్డారు. 

 

సినిమా తర్వాత ఆయన చాలా జాగ్రత్తగా సినిమాలు చెయ్యాల్సి వచ్చింది అని అంటారు. ఆ సినిమాలో ఆయన నటనకు అవార్డ్ కూడా వచ్చింది గాని సినిమా మాత్రం ఘోరంగా ఫ్లాప్ అయింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అది పక్కన పెడితే ఆయన ఇప్పుడు ఆచార్య అనే సినిమాలో అతిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: