అక్కినేని నాగార్జున‌, అక్కినేని వారి కోడ‌లు అక్కినేని స‌మంత క‌లిసి న‌టించిన సినిమాలో `రాజు గారి గది-2` ఒక‌టి. హారర్,కామెడీ నేపధ్యంలో రూపొందిన 'రాజు గారి గది' సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'రాజు గారి గది 2' చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు ఓంకార్. దీనిని ప్రసాద్ వి పొట్లూరి పి.వి.సి సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఓఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థల ద్వారా నిర్మిచాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, సమంత, సీరత్ కపూర్ ముఖ్య తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతాన్నందించాడు.

 

మలయాళంలో రూపొందిన 'ప్రేతమ్' సినిమాను స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు ఓంకార్. సినిమా ఫస్ట్ హాఫ్ మక్కీకి మక్కీ దింపినప్పటికీ సెకండ్ హాఫ్‌ను మాత్రం పూర్తిగా మార్చేశాడు. ప్రయోగాలకు ఎప్పుడు ముందుండే నాగ్.. ఈ సినిమాలో మెంటలిస్ట్ రుద్ర పాత్రలో క‌నిపిస్తాడు. సమంత ఓ ఆత్మ‌లా క‌నిపిస్తుంది. ఈ ఇద్దరి పాత్రలే సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఇక అక్కినేని కుటుంబంలో సమంత అడుగుపెట్టాక తొలిసారిగా రిలీజైన ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ, ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది.


 
హారర్ కామెడీ కాన్సెప్టు ఎంచుకున్నపుడు.. ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే హారర్, కడుపుబ్బా నవ్వించే కామెడీ అవసరం. ఈ రెండింటిని పకడ్బిందీగా డీల్ చేస్తూ గ్రిప్పింగ్ గా సాగే స్క్రీన్ ప్లే ఉన్నపుడే ప్రేక్షకుడు థ్రిల్ అవుతాడు. అయితే రాజుగారి గది 2సినిమా విషయంలో ఈ అంశాలు ఆశించిన స్థాయిలో లేవనే చెప్పాలి. ఇక గతంలో వచ్చిన రాజుగారి గది సినిమాకు స్టార్ గ్లామర్ లేక పోయినా కంటెంటుతో హిట్టయింది. అయితే ఈ సారి సినిమాను మరింత పెద్దగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నాగార్జున, సమంత లాంటి టాప్ స్టార్స్ ఇమేజ్ కూడా యాడ్ చేశారు. అయిన‌ప్ప‌టికీ ఈ సినిమా ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను తారుమారు చేసింది. వాస్త‌వానికి ఈ సినిమాకు ముందు పాజిటివ్ టాకే వ‌చ్చినా.. వాసూళ్ల పరంగా భారీ షాక్ ఇచ్చింది.  

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: