తెలుగు చిత్ర పరిశ్రమలో  విక్టరీ వెంకటేష్ కి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంటుంది. ఎంత మంది స్టార్ హీరోలు ఉన్న ఎంత మంది సీనియర్ హీరోల ఉన్నప్పటికీ వెంకటేష్ కి మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు . ఇక భారీ యాక్షన్ సన్నివేశాలతో అటు మాస్ ప్రేక్షకులను కూడా ఉర్రూతలూగిస్తూ ఉంటాడు వెంకటేష్. ఎన్నో దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు . అయితే హీరోలు అన్న తర్వాత తీసిన ప్రతి సినిమా విజయం సాధించదు కదా. ఏ హీరోకైనా హిట్లు  ఫ్లాపులు కామన్. కొన్ని భారీ అంచనాల మధ్య వచ్చి ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేస్తూ డిజాస్టర్ గా మిగిలిపోతుంటే  కొన్ని సినిమాలు మాత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయి సంచలన విజయాలను నమోదు చేస్తూ ఉంటారు. 

 

 ప్రతి హీరో కెరీర్ లో ఇలాంటి ఎత్తుపల్లాలు కామన్. అయితే అటు విక్టరీ వెంకటేశ్ కెరీర్ లో కూడా హిట్ ఫ్లాప్ సినిమాలు చాలానే ఉన్నాయి. ఇలా మొదట్లో ట్రైలర్ టీజర్ తో ప్రేక్షకుల్లో  ఎంతగానో అంచనాలను పెంచేస్తూ ఆ తర్వాత సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిన  సినిమా వెంకటేష్ కెరీర్ లో ఏది అంటే ముందుగా గుర్తొచ్చేది షాడో  సినిమా . ఈ సినిమలో వెంకటేష్ సరికొత్త లుక్తో కన్పిస్తాడు. భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయి. పగలు ప్రతీకారాలు కూడా ఉంటాయి. 

 


 కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక షాడో సినిమా డిజాస్టర్ రావడం వెంకటేశ్ కెరీర్ పైనా బాగానే ప్రభావం చూపింది. షాడో సినిమా తర్వాత వెంకటేష్ క్రమక్రమంగా సోలో సినిమాలు మాని  మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ యువ హీరోలతో నటిస్తూ వస్తున్నారు. ఇక యువ హీరోలతో నటించడం వెంకటేష్ కి బాగానే కలిసొస్తుంది. ఇదిలా ఉంటే అటు షాడో సినిమా మాత్రం వెంకటేష్ అభిమానులను నిరాశ పరిచింది అనే చెప్పాలి. కనీసం యావరేజ్ టాక్ కూడా సొంతం చేసుకోలేక పోయింది ఈ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: