మామూలుగా అయితే సెలబ్రిటీలు వరుస సినిమాలతో కనీసం ఊపిరి సలపనంత గా బిజీగా ఉంటారు. ఎప్పుడూ కనీసం హెల్త్ గురించి ఆలోచించుకునే టైం కూడా ఉండదు. కానీ ప్రస్తుతం కరోనా  వైరస్ పుణ్యమా అని ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే సెలబ్రిటీలకు ప్రస్తుతం చాలా ఖాళీ సమయం దొరికింది. సినిమా షూటింగులు అన్ని నిలిపివేయడంతో ప్రస్తుతం ఎప్పుడు బిజీ గా ఉండే సినీ సెలబ్రిటీలు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో హ్యాపీగా ఫ్యామిలీతో సమయం  గడిపేస్తున్నారు సినీ సెలబ్రిటీలు. ఇక సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తోనే  ఉన్నారు. 

 

 అయితే ప్రస్తుతం చాలా ఖాళీ సమయం దొరకడంతో ఎక్కువగా సినీ సెలబ్రిటీలు ఫిట్నెస్పై దృష్టి పెట్టిన విషయం. ఇక తమ  ఫిట్నెస్ కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ బిగ్ బీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫిట్నెస్ పై  దృష్టి పెట్టి... ఈ వయసులో కూడా ఫిట్ నెస్ కోసం ఎంతగానో కష్టపడుతున్నారు. తాజాగా అమితాబచ్చన్ జిమ్ లో  చేస్తున్న కసరత్తు లకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. అయితే ఈ ఫోటో ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Fight .. fight the fit .. fit the fight .. reflective mirrors , laterally inverted imagery .. and the inspiration with Grandson ..

A post shared by amitabh Bachchan (@amitabhbachchan) on

 ఈ ఫోటోలో కేవలం అమితాబచ్చన్ మాత్రమే కాదు అమితాబచ్చన్ మనవడు అగస్త్య నంద కూడా తాత అమితాబ్ బచ్చన్తో కలిసి వర్క్ చేస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇద్దరు కలిసి డంబుల్స్ పట్టుకొని వర్కౌట్ చేస్తుండగా అమితాబ్ బచ్చన్ తన ఫోన్ తో ఈ సందర్భాన్ని ఒక క్లిక్ ఇవ్వడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక ఓకే ఫోటోలు ఇద్దరిని... అది కూడా వర్కవుట్ చేస్తూ ఉండటం చూసి అటు  అభిమానులు కూడా మురిసిపోతున్నారు. అయితే ఈ వయసులో కూడా అమితాబచ్చన్ ఫిట్నెస్ కోసం కష్టపడుతున్న తీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది అంటున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: