ఒక హిట్  దర్శకుడు ఒక సూపర్ హీరో కాంబినేషన్లో సినిమా వస్తే ప్రేక్షకుల్లో అంచనాలు ఎలా  పెరిగిపోతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ అదే జరిగింది.. హీరోయిజాన్ని, ఎక్కువగా ఎలివేట్ చేసి  మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన దర్శకుడు బోయపాటి శ్రీను... టాలీవుడ్ లో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్న రామ్ చరణ్... వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు ఎంత రేంజిలో అంచనాలు పెరిగిపోతాయో  చెప్పాల్సిన పని లేదు. అంతే కాకుండా అది భారీ బడ్జెట్ సినిమా అయితే  అబ్బో ఇక ఈ సినిమాపై హైప్ ఒక రేంజ్ లో పెరిగిపోతుంది . ఇక్కడ ఇదే జరిగింది. 

 

 బోయపాటి శ్రీను రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమా ప్రకటన విడుదల అయిన నాటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగి పోతూనే ఉన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్.. ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ అని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కించటం సినిమాపై మరింత హైప్ పెంచింది . దీంతో ఈ సినిమా విడుదలైంది అంటే ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయం... చరణ్ క్రేజ్  ఎక్కడికో వెళ్ళిపోతుంది అని ప్రేక్షకులు భావించారు. ఇక ఈ సినిమా విడుదల అయ్యింది... ప్రేక్షకులు భారీ మొత్తంలో థియేటర్లకు వెళ్లి సినిమా చూశారు. 

 

 కానీ ప్రేక్షకులకు మాత్రం పూర్తిగా నిరాశ ఎదురైంది. అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా లేదు. ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేసింది. అయితే భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమాల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా రక్తపాతాలు ఊచకోత మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. హీరో కత్తి పట్టి విలన్లను ఊచ కోత కొస్తూనే  ఉంటాడు. ఇక మరి ఇంత రక్తపాతం.. అతిగా వైలెన్స్ ప్రేక్షకులకు రోత పుట్టించింది  అనే చెప్పాలి. కాగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా చివరికి డిజాస్టర్గా మిగిలిపోయింది. ఇండస్ట్రీ హిట్ అనుకుంటే కనీసం యావరేజ్గా కూడా సొంతం చేసుకోలేక పోయింది. అటు బోయపాటి శ్రీను ఇటు  రామ్ చరణ్ కెరియర్ పై కూడా ఎంతగానో ప్రభావం చూపింది ఈ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: