టాలీవుడ్ బ్యూటీ తమన్నా భాటియా హ్యాపీ డేస్ సినిమా లో ఎంత అందంగా కనిపించిందో... అంతే అందంగా 100% లవ్ లో కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసిన పాటలో తమన్నా అందాలకు ప్రపంచవ్యాప్తంగా చాలా కోట్లమంది సినిమా అభిమానులు ఫిదా అయిపోయారు అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా తన పాపులారిటీ పెంచుకున్న తమన్నా ఇప్పుడు తన రెమ్యూనరేషన్ పెంచాలని నిర్మాతలను అడుగుతున్నట్లు సమాచారం.


బాలీవుడ్ ఇండస్ట్రీ లో దీపికా, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ కరీనా కపూర్ లాంటి బడా స్టార్ హీరోయిన్లు హీరోలకు సమానంగా హీరోల కంటే ఎక్కువ కూడా పారితోషికం పొందుతుంటారు. హీరో హీరోయిన్ తీసుకుంటున్న పారితోషికం లో వ్యత్యాసాలు అసలు ఉండకూడదని ఈ బడా స్టార్ హీరోయిన్లు మాట్లాడుతుంటారు. కంగనా రనౌత్ కూడా ఎక్కువ రెమ్యునరేషన్ అడిగిమరీ తీసుకుంటుంది. హీరోలతో సమానంగా మేము కూడా కష్టపడుతున్నప్పుడు మాకు ఎందుకు తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారని బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతోమంది నటీమణులు నిర్మాతలను కొన్ని సందర్భాల్లో అడిగారు. ప్రస్తుతం తమన్నా భాటియా కూడా ఇదే ప్రశ్న అడుగుతుంది.


రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటుందన్న సంగతి తెలిసిందే. హాయ్ చిత్ర నిర్మాతలు తమన్నా భాటియాని రవితేజ సరసన హీరోయిన్ గా నటించే చేయాలని ఆమెను సంప్రదించారట. అయితే ఆమె తనకు ఈ మూడు కోట్లు కావాలని మూడు కోట్లు ఇస్తేనే సినిమాలో చేస్తానని తేల్చి చెప్పేసిందట. దాంతో ఒక్కసారిగా షాక్ అయిన నిర్మాతలు ఆమెను పక్కన పెట్టారట. ఈ విషయం కాస్త మీడియాకు తెలియడంతో అనేక వార్తలు వెల్లువెత్తాయి. 


వీటన్నింటిపై తమన్నా స్పందిస్తూ... ఒక నటుడి వల్లే మేము రెమ్యూనరేషన్ తీసుకోవాలి. రెమ్యునరేషన్ విషయంలో అసమానతలు అసలు ఉండకుండా చేయాలి. హీరోలు ఎంత అడిగితే అంత రెమ్యూనరేషన్ ఇస్తారు కానీ మా విషయంలో ఇలా ప్రశ్నలు ఎందుకు వేస్తారో అర్థం కాదు. మేము కూడా హీరోలకు సరి సమానంగా శ్రమ పడుతున్నాము. ఒక సినిమా సూపర్ హిట్ కావాలంటే ఫిమేల్ లీడ్ తప్పకుండా కావాలి. అటువంటప్పుడు హీరో నాగ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడంలో తప్పేముంది? ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో కూడా ఆలోచన ధోరణి మారకపోతే ఎలా?', అని ఆమె మాట్లాడింది. 


అయితే తనని రవితేజ సినిమా నుంచి పక్కన పెట్టారన్న వార్త అవాస్తవమని, ప్రొడక్షన్ హౌస్ తన మేనేజ్మెంట్ బృందంతో టచ్ లో ఉందని... పరిస్థితులు చక్కబడిన తరువాత తన రెమ్యునరేషన్ గురించి కూర్చొని మాట్లాడదామని ఆమె తెలిపింది. రవితేజతో నటించేందుకు తాను తిరస్కరించానని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఆమె అన్ని పుకార్లను ఖండించింది. ఒకవేళ రవితేజ ఛాన్స్ ఇస్తే తనతో కలిసి 10  సినిమాలు చేయడానికైనా రెడీ అని తమన్నా చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: