ఎవరో ఆ హీరో. ఆ హీరోయిన్ కి అంతగా నచ్చిన హీరో ఎవరు. ఇది ఒక విధంగా ఆసక్తిని కలిగించే విషయమే. ఇపుడున్న పరిస్థితుల్లో ఒక సినిమాలో హీరోహీరోయిన్లు  జట్టు కడితే రెండవ సినిమా ఉండడంలేదు. దానికి కారణం వెరైటీ అన్నది ఒకటైతే. హీరోహీరోయిన్ల మధ్యన ఉన్న ఇగోలు మరో కారణం. అటువంటి సమయంలో ఒకే హీరోతో పది సినిమాలు అయినా చేస్తానని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం అంటే మాటలు కాదు కదా.

 

ఆ మాటలు అన్నది ఎవరో కాదు, తళుకుబెళుకుల తమన్నా. ఆమెకు నచ్చిన హీరోల్లో రవితేజా కూడా ఒకరుట. ఆయనతో మంచి స్నేహ బంధం ఉందిట. ఈ ఇద్దరూ కలసి బెంగాల్ టైగర్ అన్న మూవీలో తొలిసారిగా  నటించారు. తాజాగా నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో కొత్త సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలోనే ఎన్నో గ్యాసిప్స్ ఇపుడిపుడే బయటకు  వస్తున్నాయి.

 

తమన్నా ఈ మూవీలో నటించదని, పారితోషికం ఎక్కువ అడుగుతోందని కూడా న్యూస్ వస్తోంది. దాంతో తమన్నా దీనికి ఫుల్ క్లారిటీ ఇస్తూ  తాజాగా తన భావాలను బయటపెట్టింది. రవితేజా మంచి కో స్టార్. ఆతనితో నేనెందుకు నటించనని అంటాను. మా ఇద్దరి మధ్యన మంది అవగాహన ఉంది. ఒక సినిమా ఏంటి పది సినిమాలు అయినా రవితేజాతో నటిస్తాను అంటోంది తమన్నా.

 

ఇక తన పారితోషికం విషయంలో వస్తున్నవి అన్నీ కూడా ఉత్త పుకార్లేనని కూడా చెబుతోంది. తనకు ఆ విషయం కూడా తెలియదు అంటోంది. ఎందుకో ఇలాంటివి పుట్టించి రాస్తున్నారని కూడా ఆవేదన చెందుతోంది. మొత్తానికి తమన్నా మాటలను బట్టి చూస్తూంటే రవితేజాతో మరోమారు జట్టు కట్టి రొమాన్స్ చేసేలా ఉంది. సో ఈ జంటను తొందరలొనే వెండి తెరపైన చూసేయవచ్చు. లాక్ డౌన్ తరువాత ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: