కాలం కలసిరావడంలేదు. బొమ్మలు చేసి ప్రాణం పోసిన వారికి ఆ బ్రహ్మ  తనదైన సినిమా  చూపించి జాతకం మార్చేస్తున్నాడు. రీల్ లైఫ్ హీరోలకు రియల్ లైఫ్ చూపించేస్తున్నాడు. సినిమా కధను అయితే రక్తికట్టించగలరేమో కానీ రియల్ కధను ఎవరూ మార్చలేరుగా. అయినా సరే ధియేటర్ల మీదనే మోజు పెంచుకుని టాలీవుడు బెట్టుగా ఉంది.

 

కొత్త హీరోల నుంచి సీనియర్ల వరకూ అంతా కూడా ధియేటర్లు తెరిస్తేనే తన బొమ్మ అక్కడే వేస్తామని అంటున్నారు. ఓటీటీ ప్లాట్ ఫారం అన్నది ఒకటి ఉంది. దాన్ని బాలీవుడ్, కోలీవుడ్ గుర్తించి బాగా ఉపయోగించుకుంటున్నాయి. ఇప్పటికే విలువైన పుణ్యకాలం గడచిపోయింది. మరో రెండు నెలల దాకా థియేటర్లు తెరవకపోతే అపుడు గతేంకానూ అన్నది నిర్మాతల ఆలోచన.

 

అయితే హీరోలు మాత్రం పెద్ద తెర మీదనే బొమ్మ పడాలని అంటున్నారు. 30 రోజులో ప్రేమించడం ఎలా అన్న సినిమాతో హీరోగా పరిచయం అయిన యాంకర్ ప్రదీప్ వంటి వారు కూడా తమ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. ఇక ఉప్పెన వంటి సినిమాను తీసిన వారు కూడా థియేటర్లకు ఓటమి లేదు అని చెబుతున్నారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే భారతీయ సినీ పరిశ్రమను తట్టుకునే సామర్ధ్యం ఓటీటీకి లేదు అంటున్నారు సినీ పండితులు. కేవలం వేయి కోట్లతో దేశమంతా సినిమాలు కొనే శక్తి  ఓటీటీకి ఎక్కడికి వస్తుందని కూడా లాజిక్ పాయింట్ తీస్తున్నారు. వారు ఇచ్చే డబ్బు తమ సినిమాలకు ఏపాటి అని కూడా అంటున్నారు. మొత్తం మీద ఓటీటీ మీద నిర్మాతలకు కాస్త మొగ్గు ఉన్నా హీరోలు, ఇతర టెక్నీషియన్లు మాత్రం నో అంటున్నారు.

 

అయితే ఇవాళ కాకపోయినా రేపు అయీఅ ఓటీటీ అన్నది ఆల్టర్నేషనే అని సినీ మేధావులు చెబుతున్నారు. ఈ రోజు ఓటీటీ వేయి కోట్లకే  పరిమితం అయిన బిజినెస్ చేయవచ్చు కానీ రేపటి రోజున మాత్రం ఇంకా ఎక్కువ పెట్టుబడులు పెట్టే రేంజికి ఎదుగుతుందని, దాని అవసరం సినిమా పరిశ్రమకు ఉంటుందని జోస్యం చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: