ఎన్టీఆర్ కి ఉన్న ఎనర్జీని బేస్ చేసుకుని సినిమా తీయాలని దర్శకులు భావిస్తున్నారు. వీరిలో కన్నడ చిత్ర సీమ నుంచి తారాజువ్వలా దూసుకొచ్చిన ప్రశాంత్ నీల్ కూడా ఉన్నాడు. ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఉంటుందని ఇటివల వార్తలు జోరందుకున్నాయి. వీటిని నిజం చేస్తూ ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా విశెష్ చెప్తూ.. ‘న్యూక్లియర్ ప్లాంట్ పక్కనే కూర్చుంటే ఎలా ఉంటుందో ఎన్టీఆర్ ఎనర్జీ అలా ఉంటుంది. ఈసారి సూట్ వేసుకుని వస్తా’ అంటూ సినిమా కన్ఫర్మ్ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీటే కన్నడ సినీ ప్రేక్షకుల ఆగ్రహానికి కారణమైంది.

 

 

ప్రశాంత్ నీల్ ట్వీట్ ను వ్యతిరేకిస్తూ చాలామంది కన్నడ సినిమా ఫ్యాన్స్ కామెంట్లు, పోస్టులు చేస్తున్నారు. ఏకంగా #GetLostPrasanthNeel అంటూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘ఇతర భాషల హీరోలు కన్నడలో సినిమాలు చేయనప్పుడు కన్నడ డైరక్టర్ తెలుగులో సినిమా చేయడం ఏంటి, ఎన్టీఆర్ ను కన్నడలోనే ఈ సినిమా చేసి తెలుగులోకి డబ్ చేసుకోమను, రాజమౌళి, శంకర్ కూడా ఇతర భాషల హీరోలతో సినిమాలు చేయలేదు, నువ్వు ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం కానీ అది కన్నడ సినిమాలతోనే..’ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

 

 

దీంతో ఎన్టీఆర్ తో ప్రశాంత్ సినిమాను వ్యతిరేకిస్తున్నారని క్లియర్ గా అర్ధమవుతోంది. ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ బాగా వైరల్ అవుతోంది. కేజీఎఫ్ సృష్టించిన సంచలనంతో ప్రశాంత్ నీల్ కు ఏకంగా నేషన్ వైడ్ క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడు తెరకెక్కిస్తున్న కేజీఎఫ్2 పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. కన్నడ సినిమాను ప్రశాంత్ మాత్రమే ప్రమోట్ చేస్తున్నాడనే స్థాయిలో ఉంది అతని క్రేజ్. ఈ కారణంగానే ఎన్టీఆర్ సినిమాను కన్నడిగులు వ్యతిరేకిస్తున్నారని చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: