గతంలో మాదిరి మేకప్ వేసుకొని.. కెమెరా ముందు నిలబడి వెళ్లిపోతే సరిపోదు. కెమెరా ఫేస్ చేయడానికి ముందే చెమటలు కక్కాలి. తెలియని విషయాలు నేర్చుకోవాలి. కథ.. క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో.. సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు ముందే.. నేర్చుకునే ప్రాసెస్ లో మన హీరోలు బిజీగా ఉంటున్నారు. 

 

అల వైకుంఠపురములో బన్నీ ఎంచక్కా స్టైలిష్ గా మాట్లాడుతూ.. స్టైలిష్ డ్యాన్స్ చేస్తూ.. స్టైలిష్ గా ఫైట్స్ చేసేసి బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. తర్వాతి మూవీ పుష్పలో లారీ డ్రైవర్ గా రఫ్ రోల్ పోషిస్తున్నాడు. అల మాదిరి స్టైలిష్ టచ్ ఇస్తే సరిపోదు. వేషమే కాదు భాష కూడా మారింది.

 

పుష్ప సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో హీరో హీరోయిన్లు బన్నీ, రష్మిక చిత్తూరు యాసలో మాట్లాడతారు. అరవింద సమేత వీర రాఘవ కోసం ఎన్టీఆర్ కు రాయలసీమ స్లాంగ్ లో శిక్షణ ఇచ్చిన పెంచల్ దాసే బన్నీకి కూడా ఇస్తున్నాడని తెలిసింది. గతంలో రుద్రమదేవిలో పోషించిన గోనగన్నారెడ్డి రోల్ కోసం తెలంగాణ మాండలికం నేర్చుకున్నాడు బన్నీ.

 

సరిలేరు నీకెవ్వరు.. భీష్మలో గ్లామర్ గా కనిపించిన రష్మిక.. పుష్ప సినిమాలో గిరిజన యువతిగా డీ గ్లామరైజ్డ్ రోల్ పోషిస్తోందట. లాక్ డౌన్ టైమ్ లో చిత్తూరు యాసను ప్రాక్టీస్ చేసే పనిలో బిజీగా ఉంది రష్మిక.

 

ఈ మధ్యకాలంలో హీరోలు ఎక్కువగా తెలంగాణ.. రాయలసీమ స్లాంగ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. అరవింద సమేత వీర రాఘవలో రాయలసీమ యాసతో ఇంప్రెస్ చేసిన తారక్.. ఆర్ఆర్ఆర్ కోసం.. తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతున్నాడు. 

 

సాధారణంగా స్లాంగుల జోలికి వెళ్లని వెంకటేశ్.. రీమేక్ మూవీ కోసం రాయలసీమ యాసను నేర్చుకున్నాడు. తమిళంలో హిట్ మూవీ అసురన్ తెలుగు రీమేకుల్లో వెంకటేశ్ నటిస్తున్నాడు. నారప్ప టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. రాయలసీమ యాసను వెంకటేశ్ ఎలా పలుకుతాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: