ఇదిలావుంటే
నాగ శౌర్య చేతిలో ప్రస్తుతం నాలుగు
సినిమా వున్నాయి. అందులో
శ్రీనివాస్ అవసరాలతో చేస్తున్న
సినిమా ఒకటి. గత ఏడాది మొదలైన ఈసినిమా 50శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది అయితే ఈచిత్రాన్ని పక్కకు పెట్టి
నాగ శౌర్య
అశ్వథ్థామ ను లైన్ లోకి తెచ్చాడు. అలా ఈసినిమా కు బ్రేక్ పడింది అయితే త్వరలోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయనున్నాడు. ఇక శౌర్య ప్రస్తుతం
లక్ష్మి సౌజన్య డైరెక్షన్ లో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. రీతూ
వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ
సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాతోపాటు
సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్ లో అలాగే మహేష్ ఎస్ కోనేరు నిర్మాణంలో నూతన దర్శకుడు రాజాతో
నాగ శౌర్య సినిమాలు చేయాల్సి వుంది.