కరోనా మహమ్మారితో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఆర్ధికంగా చాలా దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా మొదలుకొని చిన్న బడ్జెట్ సినిమాల వరకు అనుకున్న ప్లానింగ్ మొత్తం మారిపోయింది. దాదాపు 2 నెలలకి పైగానే షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. సినిమాకి సంబంధించి ఏ ఒక్క పని చేసే వీలు లేకుండా లాక్ డౌన్ తో అన్ని మూతపడ్డాయి. ఇక రిలీజ్ కి రెడీ అనుకున్న సినిమాలు ల్యాబ్ లోనే ఉండిపోవడంతో నిర్మాతలు భారీగా నష్టపోయారు. అయితే త్వరలో మళ్ళీ షూటింగ్స్ కి సంబంధించి అలాగే థియోటర్స్ ఓపెనింగ్ కి సంబంధి గుడ్ న్యూస్ రాబోతుందని తాజా సమాచారం.

 

ఇప్పటికే టాలీవుడ్ కి పెద్ద గా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, సినిమాటోగ్రఫీ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రీసెంట్ గా జరిగిన సమావేశంలో టాలీవుడ్ కి చెందిన నిర్మాతలు... దర్శకులు పాల్గొని చిత్ర పరిశ్రమలో నెలకొన్ని ఇబ్బందుల గురించి చర్చించారు. ఈ నేపథ్యంలో సినిమా, టీవీ షూటింగ్‌లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు. షూటింగ్‌లకు అనుమతులపై పరిశీలిస్తున్నామని, సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అంతేకాదు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకోవచ్చంటూ తెలిపారు.

 

ఇక త్వరలో థియోటర్స్ కూడా ఓపెన్ చేసే అంశం మీద చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయి. దాంతో నిర్మాతలు జూలై నుంచి సినిమాలు రిలీజ్ చేసుకునేందుకు షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారట. ఇప్పటికే రెడీగా ఉన్న నాని వి సినిమా, రాం రెడ్, మాస్ మహారాజా రవితేజ క్రాక్, అనుష్క నటించిన నిశబ్ధం సినిమాలు ముందు రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని చిన్న సినిమాలు రిలీజ్ కి సిద్దంగా ఉన్నాయి. ఆ తర్వాత నుంచి వకీల్ సాబ్ లాంటి భారీ సినిమాలు సిద్దం కానున్నాయట. అయితే థియోటర్స్ లో కరోనా నిబంధనలు తప్పనిసరి.   

మరింత సమాచారం తెలుసుకోండి: