అసలే ఇండస్ట్రీలో కరోనా కారణంగా కోలుకోలేని దెబ్బ పడింది. రోజు వారి కార్మీకుడి దగ్గరనుంచి హీరోలు, దర్శకులు, నిర్మాతల దాకా అందరికీ ఇది మామూలు దెబ్బ కాదని అందరికి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితులు చక్కబడుతున్నాయి. నెమ్మదిగా పనులు మొదలవుతున్నాయి. ఇక త్వరలో ఇండస్ట్రీలో కూడా 24 క్రాఫ్ట్స్ కి సంబంధించిన పనులు మొదలయ్యో అవకాశాలున్నాయని తాజాగా మెగాస్టార్ ఇంట్లో జరిగిన సమావేశం ద్వారా ఒక క్లారిటి వచ్చింది. 

 

ఇప్పటికే కొద్ది మంది ఎంప్లాయిస్ తో ఇన్ హౌజ్ వర్క్స్ చేసుకోవచ్చు అంటూ కొంతమేర సడలింపులిచ్చారు. ఎడిటింగ్, డబ్బింగ్, రీ రికార్డింగ్, వీఎఫెక్స్ ..లాంటి పనులను చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. ఇక త్వరలో సినిమాల షూటింగ్స్ అలాగే కరోనా నిబంధనలతో థియోటర్స్ ఓపెనింగ్ కూడా ఉండబోతుంది. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయంలో పూర్తి సమాచారం అందబోతుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ క్రియోట్ చేసే వాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు.

 

ఇస్టానుసారంగా తోచిన వార్త రాసేయడం మిగతా వెబ్ సైట్స్ కూడా అదే వార్తను తిప్పి తిప్పి రాయడంతో ఆ వార్తల వలన ఇండస్ట్రీ వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కొంటుండగా జనాలు ఏది నిజమో ఏది అబద్దమో తెలియని గందరగోళంలో పడుతున్నారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ మీద క్రియోట్ అయిన వార్త ఇండస్ట్రీలో పెద్ద సంచలనమే అయింది. 

 

దీనిపై విజయ్ దేవరకొండ చాలా సీరియస్ గా స్పందించడంతో ఆయనకి మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు తో సహా మొత్తం టాలీవుడ్ సపోర్ట్ గా నిలిచారు. ఇక ఇలాంటి న్యూసే మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. అందులో ఒకటి ప్రముఖ గేయ రచయిత ashok TEJA' target='_blank' title='సుద్దాల అశోక్ తేజ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సుద్దాల అశోక్ తేజ కి సంబందించినది కాగా మరొకటి రవితేజ సినిమాకి సంబంధిచి. ashok TEJA' target='_blank' title='సుద్దాల అశోక్ తేజ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సుద్దాల అశోక్ తేజ కి అనారోగ్యంగా ఉందని ఆయనకు శస్త్ర చికిత్స అవసరం ఉంటుందని న్యూస్ వచ్చి స్ప్రెడ్ అయింది. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదని సన్నిహిత వర్గాల ద్వారా తేలింది. 

 

అలాగే రవితేజ రమేష్ వర్మసినిమా కూడా క్యాన్సిల్ అని న్యూస్ రాసేసారు. అది ఫేక్ న్యూస్ అని స్వయంగా నిర్మాత కోనేరు సత్యనారాయణ క్లారిటి ఇచ్చారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నానని మిగతా విషయాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. అయితే ఇలా రోజుకో ఫేక్ న్యూస్ క్రియోట్ చేసే సైట్స్ మీద లాక్ డౌన్ తర్వాత తగు చర్యలు తీసుకోబోతున్నట్టు అందుకు ఇండస్ట్రీలో ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఇక కింగ్ నాగార్జున ఈ ఫేక్ వెబ్ సైట్స్ మీద పోరాటానికి సిద్దం.. "ప్లాన్ ఆఫ్ యాక్షన్" అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: