సక్సెస్ ఫుల్ డైరక్టర్ హరీష్ శంకర్ లాస్ట్ ఇయర్ గద్దలకొండ గణేష్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. రిలీజ్ చివరి నిమిషం వరకు టెన్షన్ తో వచ్చిన ఆ సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటాడు హరీష్ శంకర్. ఇక ఆ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. వకీల్ సాబ్ తర్వాత క్రిష్ సినిమా దాని తర్వాత హరీష్ శంకర్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తారని అంటున్నారు.

 

ఇక ఈ సినిమాతో పాటుగా హరీష్ శంకర్ 14 రీల్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరో ఎవరన్నది మాత్రం క్లారిటీ రాలేదు. తెలుస్తున్న సమాచారం ప్రకారం సూపర్ స్టార్ మహేష్ తో హరీష్ శంకర్ సినిమా ఉంటుందని అంటున్నారు. 14 రీల్స్ బ్యానర్ సినిమా అంటే మహేష్ కూడా ఒప్పుకోవడం గ్యారెంటీ.. మహేష్ తో  దూకుడు,1 నేనొక్కడినే, ఆగడు సినిమాలు చేశారు. మధ్యలో కొద్దిగా ట్రాక్ తప్పినట్టు అనిపించిన ఈ ప్రొడక్షన్ హౌజ్ మళ్ళీ పుంజుకోవాలని చూస్తుంది. గద్దలకొండ గణేష్ సినిమా టైం లో హరీష్ శంకర్ తో కంఫర్ట్ అనిపించడంతో అతనితో మరో సినిమా ఫిక్స్ చేసుకున్నారు 14 రీల్స్ నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట. 

 

ఈ సినిమాలో మహేష్ నటించడానికి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మహేష్ ప్రస్తుతం పరశురామ్ డైరక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాత రాజమౌళి డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. అయితే హరీష్ శంకర్ సినిమా రాజమౌళికి ముందు ఉంటుందా లేక తర్వాతా అన్నది తెలియాల్సి ఉంది.                   

మరింత సమాచారం తెలుసుకోండి: