అవును.. ఈ సినిమా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమా. సాధారణంగానే మణిరత్నం ఫాస్ట్ ఫార్వార్డ్ ఉంటాడు. అలానే 10 ఏళ్ళ ముందే ఆలోచించి సినిమాలు తీస్తాడు.. అలా తీసిన సినిమాలే సఖి.. ఓకే బంగారం. సఖి సినిమా 2010 లో రావాల్సిన సినిమా.. 2000 లోనే తీసేశాడు.. ఇంకా ఓకే బంగారం సినిమా 2025లో రావాల్సింది.. కానీ 2015లోనే తీసేశాడు. 

 

ఇలా కొన్ని సినిమాలు ఉంటాయి.. ఎంతో అద్భుతంగా ఉంటాయి. అలా ఉన్న సినిమాలే ఇవి.. అంటే మణిరత్నం పదేళ్ల ముందే ఒక కొత్త లవ్ స్టోరీని తీస్తాడు. ఇంకా ఈయన తీసిన సినిమాల్లో దాదాపు తమిళ్ వర్షన్ తెలుగులోకి వస్తాయి. అలా వచ్చిన సినిమానే ఓకే బంగారం. ఇంకా ఈ సినిమా ఇప్పటికి ఎప్పటికి సూపర్ హిట్టే. 

 

అసలు లివింగ్ రిలేషన్ అంటే సెక్స్ మాత్రమే అని అనుకునే వారికీ.. అది కాదు అని చెప్పిన సినిమా ఇది. సెక్స్ అంటే జీవితంలో కేవలం ఒక పార్ట్ మాత్రమే.. అంతకు మించిన ఎన్నో ఏమోషన్స్ ఒక అమ్మాయికి.. అబ్బాయికి మధ్యలో ఉంటాయి అనేది ఈ సినిమా కళ్ళకు కట్టినట్టు చూపించింది. 

 

అంతేకాదు.. లివింగ్ రేలషన్ లో ఉంటే ఒకరిని ఒకరు నిందించుకోరు.. స్నేహితులులా ఉంటారు.. కానీ ఎవరైనా ఎక్కడైనా వెళ్లి రావచ్చు.. చెప్పాల్సిన అవసరం లేదు.. ఇది లివింగ్ రిలేషన్ కాదు అని.. అసలు భారతీయ సాంప్రదాయం కాదు అని.. ఎంతో చక్కగా చెప్పిన సినిమా ఇది. పాటలు కానీ.. స్టోరీ కానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాంటి గొప్ప ఫీల్ ఉన్న సినిమా మళ్లీ రావాలి అంటే మణిరత్నమే తియ్యాలి.                                

మరింత సమాచారం తెలుసుకోండి: