తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి ఒక్క సారొఇగా జూలు విదిల్చింది. హై కోర్టు ఆదేశాల మీద ఎట్టకేలకు టెస్టుల సంఖ్య పెంచిన ప్రభుత్వం వారం రోజులుగా దాని ఫలితాన్ని చూస్తోంది.

 

తెలంగాణ లో కరోనా వ్యాప్తిమళ్లీ పెరుగుతోంది. గురువారం నాడు కొత్తగా 38 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 26 కేసులు, రంగారెడ్డి జిల్లాలో మరో 2 పాజిటివ్ కేసులు ఉండగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో మరో 10 వలస కార్మికులకు  మందికి కరోనా సోకింది

 

ఇదే సమయంలో గురువారం ఒక్కరోజే తెలంగాణలో ఐదుగురు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 45కు చేరిందితెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 618 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. నేడు 23 మంది డిశ్చార్జి కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 1,036కి చేరింది.

 

ఇక దేశ వ్యాప్తంగా 1,15,315 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 46,840 కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 64,937 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3,498 మరణాలు సంభవించాయి.

 

కాగా, దేశ వ్యాప్తంగా మే 31 వరకు లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ పలు సడలింపులను రాష్ట్రాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రజా రవాణా ప్రారంభమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: