ఓ వైపు ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా ఎలా విల‌య తాండ‌వం చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. క‌రోనా దెబ్బ‌తో ఎవ‌రికి వారు విల‌విల్లా డి పోతున్నారు. క‌రోనా వ్య‌వ‌స్థ‌ల‌ను అన్నింటిని కుదేలు చేసేసింది. ఇక క‌రోనా దెబ్బ‌తో ఎంట‌ర్టైన్ మెంట్ రంగం ఎలా కుప్ప కూలిపోయిందో చూస్తూనే ఉన్నాం. గ‌త రెండు నెల‌ల‌కు పైగా థియేట‌ర్లు అన్ని బంద్ అయ్యాయి. ఇక ఈ థియేట‌ర్లు ఎప్ప‌ట‌కి తెర‌చు కుంటాయో కూడా తెలియ‌ని దుస్థితి. ఇక షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభ మ‌వుతాయో కూడా తెలియ‌డం ఇలాంటి సంక్లిష్ట ప‌రిస్థితుల్లో నిన్న‌టికి నిన్న తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు స్టార్ హీరోలు.. నిర్మాత‌ల‌తో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో స‌మావేశం ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే.

 

క‌రోనా త‌ర్వాత సినిమా షూటింగ్‌లు ఎలా ప్లాన్ చేయాలి ?  థియేట‌ర్లు ఎప్ప‌టి నుంచి తెర‌చుకునేలా ఆలోచ‌న చేయాల‌న్న ప్లాన్‌తో ఈ స‌మావేశం ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఓ వైపు సినిమా రంగం ఇలా కుదేలై పోవ‌డ‌తో మ‌రో వైపు ప‌లువురు చిన్న సినిమాల‌ను డైరెక్టుగా ఓ టీటీలో రిలీజ్ చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. మ‌రి కొంద‌రు చిన్న సినిమాలు చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ లిస్టులోకి స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార వ‌చ్చి చేరిన‌ట్టు స‌మాచారం. 

 

న‌య‌న తార ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తానే స్వ‌యంగా ఓ చిన్న సినిమా ప్లాన్ చేయాల‌ని భావిస్తోంద‌ట‌. ఈ సినిమాకు న‌య‌న్ ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా హాట్ హాట్ క‌థాంశంతో ఉండేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. న‌య‌న్ కు హాట్ సీన్ల‌లో న‌టించ‌డం ఇది కొత్తం కాదు. అయితే ఇప్పుడు ఈ వ‌య‌స్సులోనూ త‌న ప్రియుడి ద‌ర్శ‌క‌త్వంలో హాట్ హాట్ గా క‌నిపించ‌డం అంటే విశేష‌మే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: